OTT releases today: అఖండ, శ్యామ్ సింగరాయ్, లూసర్.. ఇతర భాషల్లో ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు ఇవే!

కరోనావైరస్ కారణంగా థియేటర్లకు వెళ్లే పరిస్థితి లేని సమయంలో వినోదానికి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ ప్రేక్షకులకు అడ్డాగా మారాయి. థియేటర్లలో రిలీజ్ చేసుకోలేని పరిస్థితుల్లోను, అలాగే థియేటర్లలో రిలీజైన చిత్రాలను ప్రేక్షకులకు మరింత చేరువగా చేయడానికి ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపిన చిత్రాలు, విభిన్నమైన కంటెంట్‌తో వస్తున్న సినిమాలు జనవరి 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ చిత్రాల జాబితా ఏమిటంటే..

Recommended Video

Tollywood : Movies Ready To Release On OTT & Streaming Details | Filmibeat Telugu
సోని లివ్‌లో భూతకాలం మలయాళ మూవీ

సోని లివ్‌లో భూతకాలం మలయాళ మూవీ

హారర్, సస్పెన్స్ చిత్రంగా భూతకాలం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సోని లివ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ చిత్రంలో విలక్షణ నటి రేవతి, షేన్ నిగమ్, సైజూ కురూప్ నటించారు. ఈ సినిమాపై ఇప్పటికే సినీ విమర్శకులు, ప్రేక్షకులు ప్రశంసల కురిపిస్తున్నారు. షేన్; రేవతి ఫెర్ఫార్మెర్స్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.

జీ5లో లూజర్ సీజన్ 2 వెబ్ సిరీస్

జీ5లో లూజర్ సీజన్ 2 వెబ్ సిరీస్

స్పోర్ట్స్ డ్రామా జాన‌ర్‌లో రూపొందిన ఒరిజినల్ సిరీస్ లూజర్‌ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ప్రజల కోరిక మేరకు తాజాగా ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్, కల్పికా గణేష్, శశాంక్, పావనీ గంగిరెడ్డి, హర్షిత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన లూజర్ హిట్ సిరీస్‌కు సీక్వెల్‌గా లూజర్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి సీజన్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది.

లూజర్ 2కు అభిలాష్ రెడ్డి, శ్రవణ్ మాదాల దర్శకత్వం వహించారు. అభిలాష్ రెడ్డి క్రియేటర్. జీ5, అన్న‌పూర్ణ స్టూడియోస్‌, స్పెక్ట్ర‌మ్ మీడియా నెట్‌వ‌ర్క్ నిర్మించాయి. ఈ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది.

అమెజాన్‌లో అన్‌పాజ్డ్: నయా సఫర్

అమెజాన్‌లో అన్‌పాజ్డ్: నయా సఫర్

హిందీలో రూపొందిన అన్‌పాజ్డ్: నయా సఫర్ టెలివిజన్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్‌కు రుచిర్ అరుణ్, నుపూర్ అస్థానా, అయప్ప కేఎం, శిఖా మకన్, నాగరాజ్ మంజులే దర్శకత్వం వహించారు. శ్రీయా ధన్వంతరి, ప్రియాంశు, సాకిబ్ సలీం, ఆశీష్ వర్దమ, గీతాంజలి కులకర్ణి, నాగ్‌రాజు మంజులే తదితరులు నటించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది.

నెట్‌ఫ్లిక్స్‌లో శ్యామ్ సింగరాయ్

నెట్‌ఫ్లిక్స్‌లో శ్యామ్ సింగరాయ్

రాహుల్ సంకిృత్యన్ దర్శకత్వంలో నాని, సాయిపల్లవి, కృతిశెట్టి నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. థియేట్రికల్ రన్ ముగియడంతో శ్యామ్ సింగరాయ్‌ చిత్రాన్ని తెలుగు, బెంగాళీ భాషల్లో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ద్వారా జనవరి 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది.

డిస్నీ+హాట్‌స్టార్‌లో అఖండ

డిస్నీ+హాట్‌స్టార్‌లో అఖండ

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ చిత్రం థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకొన్నది. ఈ చిత్రం ఇప్పటికే 200 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇంకా థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్నది. ఈ చిత్రాన్ని డిస్నీ+హాట్ స్టార్ యాప్‌లో జనవరి 21 తేదీ సాయంత్రం 6 గంటల నుంచి స్ట్రీమింగ్ కానున్నది.

జీ5లో ముదల్ నీ ముదివమ్ నీ

జీ5లో ముదల్ నీ ముదివమ్ నీ

ముదల్ నీ ముదివమ్ నీ తమిళ చిత్రం ఓటీటీ ద్వారా రిలీజ్ అవుతున్నది. దర్బుక శివ దర్వకత్వంలో సమీర్ భరత్ రామ్ నిర్మాతగా రూపొందిన ఈ చిత్రం జీ5 ఓటీటీలో జనవరి 21న రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రంలో అమృత మాండరిన్, పూర్వ రఘునాథ్, హరీష్ కుమార్, శరణ్ కుమార్, మంజునాథ్ లాంటి యువ నటీనటులు నటించారు.

సోని లివ్‌ ఓటీటీలో బ్యాచ్‌లర్

సోని లివ్‌ ఓటీటీలో బ్యాచ్‌లర్

తమిళ అడల్డ్ కంటెంట్ చిత్రం బ్యాచ్‌లర్ సోని లివ్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ చిత్రంలో జీవీ ప్రకాశ్ కుమార్, దివ్య భారతి, మిస్కిన్, భగవతి పెరుమల్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సతీష్ కుమార్ దర్శకత్వం వహించారు. దిల్లిబాబు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా కూడా సోని లివ్‌లో జనవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X