twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ వారం ఓటీటీ సినిమాలు.. తెలుగు ఆడియన్స్ ను అలరించనున్న సినిమాలు ఏవేవంటే?

    |

    గత ఏడాది టాలీవుడ్ కరోనా కారణంగా చాలా నష్ట పోయింది, దేశం అంతా లాక్ డౌన్ లోకి వెళ్లడంతో దాదాపు ఐదారు నెలల పాటు థియేటర్లు ఓపెన్ చేయలేని పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో సినిమా నిర్మాతలను కాస్త ఆదుకున్న వ్యవస్థ ఏదైనా ఉందా అంటే అది ఓటీటీ అని చెప్పక తప్పదు. ఇప్పుడు ఈ ఏడాది కూడా దాదాపు గత ఏడాది ఉన్న పరిస్థితి మళ్ళీ రిపీట్ అయింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ పరిస్థితి కొంత మెరుగు పడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన కొన్ని సినిమాలు ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే కొన్ని అయ్యాయి కూడా. ఈ వారం టాప్ OTT ప్లాట్‌ఫామ్‌లలో ప్రీమియర్ చేయబడిన తాజా సినిమాల లిస్టు మీకోసం అందిస్తున్నాం. మీ వీకెండ్ లో ఏ సినిమా చూడచ్చో మీరే డిసైడ్ అవండి. ఈ వారంలో రిలీజ్ అయ్యే కొన్ని ఆసక్తికర సినిమాల విషయానికి వస్తే

    ‘అలాంటి సిత్రాలు’.

    ‘అలాంటి సిత్రాలు’.


    జర్నలిస్ట్ గా కెరీర్ ఆరంభించి సినిమా బిజినెస్ లో ఎంటర్ రాఘవేంద్రరెడ్డి తొలిసారి నిర్మాతగా పూరి జగన్నాధ్ శిష్యుడు సుప్రీత్.సి.కృష్ణ దర్శకుడు తీసిన సినిమా 'అలాంటి సిత్రాలు'. కొత్తవారితో తీసిన ఈ సినిమా జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. రాగ్, పల్లవి, దిలీప్, యశ్ జీవితంలో ఎదురైన సంఘటనలు, వారి భావోద్వేగాల సమాహారం ఈ సినిమా. ఈ సినిమా 24 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

    'ఆకాశవాణి'

    'ఆకాశవాణి'

    దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దగ్గర శిష్యుడిగా పని చేసి అశ్విన్ గంగరాజు 'ఆకాశవాణి' దర్శకుడిగా రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మాతగా రూపొందించారు. కమర్షియల్ ఫార్మాట్ కు దూరంగా సరికొత్త కథతో ప్రేక్షకులను అలరించడానికి ఈ సినిమాతో ముందుకొచ్చాడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లైవ్ లో విడుదలైన ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా 24 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

    తలైవి

    తలైవి

    ఈ బయోగ్రాఫికల్ పొలిటికల్ థ్రిల్లర్ థియేట్రికల్ విడుదల తర్వాత మంచి రివ్యూలను పొందింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పూర్తిగా చతికిల పడింది. ఇక ఈ సినిమా ఈరోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రదర్శించబడుతొంది. అయితే ఈ సినిమా థియేట్రికల్ విడుదల తర్వాత కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఓటీటీకి వచ్చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో కంగనా రనౌత్ మరియు అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించారు.

    కోటా ఫ్యాక్టరీ సీజన్ 2

    కోటా ఫ్యాక్టరీ సీజన్ 2

    కోటా ఫ్యాక్టరీ యొక్క రెండవ సీజన్ కూడా అద్భుతమైన రివ్యూలను అందుకుంది. ఈ సిరీస్ రోజువారీ జీవితంలో IIT-JEE ఔత్సాహికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. ఇక ఇది నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.

    సూసైడ్ స్క్వాడ్

    సూసైడ్ స్క్వాడ్

    సూసైడ్ స్క్వాడ్ సినిమా ఈ సంవత్సరం ప్రారంభంలో థియేటర్ లలోకి వచ్చింది. సినీ ప్రేక్షకుల నుండి ఈ సినిమాకి చాలా మంచి ఆదరణ లభించింది. ఇది ఆపిల్ టీవీ ప్లస్ లో ప్రసారం కాబోతోంది.

    హాతి మేరే సాథీ

    హాతి మేరే సాథీ


    హాతి మేరే సాథీ యొక్క తెలుగు వెర్షన్, అరణ్య ఈ సంవత్సరం ప్రారంభంలో థియేటర్ లలోకి వచ్చింది. వివిధ కారణాల వల్ల హిందీ వెర్షన్ వెండి తెరపైకి రాలేదు. ఇప్పుడు, హిందీ వెర్షన్ జియో సినిమాలో ప్రసారం అయ్యే అవకాశం ఉంది.

    English summary
    Due to lockdown there would be no theatres open for the month. There are several films heading for a digital release in the month of September . here is the full list
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X