‘పుష్ప’ మూవీకి అక్కడ భారీ ఆఫర్: క్లోజ్ అయితే అల్లు అర్జున్ కెరీర్‌లో ఇదో రికార్డు
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా.. బడా డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తోన్న చిత్రం 'పుష్ప'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. ఇందులో బన్నీ స్మగ్లర్ పుష్పరాజ్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌తో నిర్మితం అవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లకు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమా హక్కులకై చాలా సంస్థలు పోటీ పడుతున్నట్లు ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది.
ఐదు భాషల్లో రూపొందుతోన్న 'పుష్ప' మూవీ హక్కుల కోసం ఇప్పటికే ఎన్నో సంస్థలు భారీ డీల్స్‌తో ముందుకు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓవర్సీస్‌కు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ.. తాజాగా ఈ సినిమా విదేశీ హక్కుల కోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిందట. అల్లు అర్జున్ కెరీర్‌లోనే గతంలో ఏ సినిమాకూ రాని ఆఫర్ కావడంతో దర్శక నిర్మాతలు దీనిపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ డీల్ ఆ మొత్తానికే క్లోజ్ అయితే బన్నీ ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరుతుందట. దీంతో దీనిపై సినీ వర్గాల్లో చాలా ఆసక్తి నెలకొంది.

'పుష్ప' సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్‌ను ఈ దసరాకు.. రెండో దానిని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విలన్‌గా చేస్తుండగా.. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్రను పోషిస్తోంది. ఇక, దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











