అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భారీగా విరాళాలు.. మానవత్వాన్ని చాటుకున్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్..

నందమూరి బాలకృష్ణ , బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా అఖండ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా బాలయ్య అఘోరా పాత్రలో కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ టీజర్ నుంచే అఖండపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా అంతకుమించి అనేలా ఉంటుందని ప్రీ రిలీజ్ ఈవెంట్ తోనే క్లారిటీ ఇచ్చేశారు. అభిమానులు అఖండ కోసం ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు. ఇక సినిమాకు సంబంధించిన ఈవెంట్ లో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ వారి సేవాగగుణాన్ని చాటుకున్నారు.

బాలకృష్ణ అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాల‌య్య అభిమానులతో పాటు ఓవ‌ర్సీస్ డిస్ట్ర‌బ్యూట‌ర్స్ బ‌స‌వ‌తార‌కం క్యాన్సర్ హాస్స‌ట‌ల్ లో జ‌రుగుతున్న సేవాకార్య‌క్ర‌మాల‌కు వారి వంతు సహాయం చేసి అండ‌గా నిలిచారు. గత కొంతకాలంగా బ‌స‌వ‌తార‌కం క్యాన్సర్ హాస్స‌ట‌ల్ సంరక్షణలో ఎంతోమంది పేదలు సహాయాన్ని అందుకుంటున్నారు. అత్యాధునిక వైద్య సదుపయలనూ కల్పిస్తూ బాలకృష్ణ పేదలకు అండగా ఉంటున్నారు. ఇక ఇటీవల ఓర‌ర్సీస్ డిస్ట్రిబ్యూట‌ర్స్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అందుకున్న వెంక‌ట్ ఉప్పుటూరి , గోపీచంద్ ఇన్నమూరి గారు రాధాకృష్ణ ఎంట‌ర్ టైన్మెంట్ ఎల్ ఎల్ పి.. ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్ ను నందమూరి బాలాకృష్ణ గారికి అంద‌జేసారు.

Overseas Distributors donations at Akhanda Pre-Release Event

టాలీమూవీస్ మోహాన్ క‌మ్మ కూడా రెండు ల‌క్ష‌లు, అందించారు. ఇక కెనెడా తెలుగు మూవీస్ సుమంత్ సుంక‌ర ఒక ల‌క్ష రూపాయుల వరకు విరాళంగా ఇచ్చారు. టోటల్ గా ఎనిమిది ల‌క్ష‌ల వరకు బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ హాస్ప‌ట‌ల్ కి విరాళంగా అందించడం జరిగింది. అఖండ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో అందరిని కూడా దాతలు ఎంతగానో ఆకట్టుకున్నారు.

ఇక ఓవ‌ర్సీస్ లో కూడా అఖండ సినిమా భారీగా విడుదల అవుతోంది. దాదాపు 500 థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతున్న అఖండ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదివరకే బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సింహా లెజెండ్ సినిమాలు ఏ స్థాయిలో విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక డిసెంబర్ 2న రిలీజ్ అవుతున్న అఖండ మూవీ అంతకుమించి అనేలా ఉంటుందని హడావిడి చూస్తుంటేనే అర్ధమవుతోంది. అలాగే ఇటీవల కాలంలో కరోనా ప్రభావం వలన సినిమా మార్కెట్ మళ్ళీ డౌన్ అవ్వగా అఖండ సినిమా పూర్వ వైభవం తెస్తుందని అంటున్నారు. ఇక అఖండ సినిమాకు థమన్ అందించిన మ్యూజిక్ కూడా మేజర్ ప్లస్ పాయింట్ గా నిలవనున్నట్లు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. కేవలం టైటిల్ సాంగ్ కోసమే థమన్ నెల రోజుల పాటు కష్టపడ్డాడట. సినిమాకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరొక లెవెల్లో ఉంటుందని థమన్ ఇదివరకే ఒక వివరణ ఇచ్చారు. మరి అఖండ సినిమా అభిమానుల అంచనాలను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X