ఓయ్ సినిమా డైరెక్టర్‌ను గుండు నాయాలా అంటే.. నవ్వి నవ్వి సచ్చేలా రిప్లై.. ఏమన్నాడంటే?

2009లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ లవ్ స్టోరీ ఓయ్ గురించి అందరికీ తెలిసిందే. సిద్దార్థ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో బేబీ శామిలి హీరోయిన్ గా చేసింది. అలాగే నెపోలియన్, సినీల్, ఆలీ, ప్రదీరప్ రావత్, ఎమ్.ఎస్ నారాయణ, తనికెళ్ల భరణి, సురేఖ వాణి, కృష్ణుడు వంటి వాళ్లంతా ఈ చిత్రంలో నటించారు. అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించిన ఈ చిత్ర నటీనటులతో పాటు దర్శక, నిర్మాతలకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.

ముఖ్యంగా డైరెక్టర్ ఆనంద్ రంగకు విపరీతమైన గుర్తింపు వచ్చింది. ఆతర్వాత నుంచి ఈ డైరెక్టర్ సినిమాలు చేయలేదు. సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియా వేధికగా మాత్రం అందరికీ అందుబాటులోనే ఉన్నాడు. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. అయితే చాలా కాలంగా పలు సినిమాలు రీరిలీజ్ అవుతుండడం చూసి.. ఓయ్ సినిమాను కూడా రీరిలీజ్ చేయమంటూ ఎక్స్ వేధికగా ఆనంద్ రంగాను కోరారు.

Oye Movie Director Ananda Ranga Shocking Reply to Who Commented Him Gundu Nayala Check Details

దీనికి స్పందించిన ఆనంద్ రంగా ఓయ్ సినిమాను.. ఈనెల 14వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ పోస్ట్ చూసిన ఓ నెటిజెన్.. ఓయ్ సినిమా తర్వాత మరే సినిమాలు చేయలేదనే కోపంతో.. ఒరేయ్ గుండు నాయాలా ఇలాంటి మంచి సినిమా తీసి ఆ తర్వాత ఎటు పోయావ్ రా అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ కామెంట్ ను చూసిన డైరెక్టర్ ఆనంద్ రంగా దీనిపై స్పందించారు. నవ్వుతున్న ఎమోజీని యాడ్ చేసి రిప్లై ఇచ్చాడు. ఇది చూసిన సదరు నెటిజెన్.. మిమ్మల్ని గుండ అన్నందుకు సారీ అని బదులు ఇచ్చాడు.

దీనికి మళ్లీ డైరెక్టర్ ఆనంద్ రంగా స్పందిస్తూ... పర్వాలేదు అది నిజమై కదా అంటూ మరోసారి రిప్లె ఇచ్చాడు. ఈ తతంగం అంతా చూసిన నెటిజెన్లు.. డైరెక్టర్ ఇలా స్పోర్టివ్ గా స్పందించడం నిజంగా చాలా షాకింగ్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇదంతా జరిగిన తర్వాత డైరెక్టర్ గుండుతో ఉన్న తన ఫొటోను పోస్ట్ చేసి పైన గుండు నాయాలా అనే ట్యాగ్ పెట్టాడు. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ కామెంట్ల వర్షం కురిపిస్తూనే ఉన్నారు.

Oye Movie Director Ananda Ranga Shocking Reply to Who Commented Him Gundu Nayala Check Details

నవ్వి నవ్వి సచ్చిపోతున్నాం... గుండు నాయాలా ఏంటి సార్ అంటూ ఆనంద్ రంగాను అడుగుతూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఓయ్ గుండు నాయాలా అనే సినిమా చేయండి అంటూ మరికొందరు అడుగుతున్నారు. చాలా స్పోర్టివ్ గా తీసుకుంటూ.. భలే రిప్లై ఇస్తున్నారు సార్.. గతంలో మేము ఏం అడిగినా సమాధానం చెప్పని మీరు ఇప్పుడు చెప్పడం వెనుక కారణం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఓయ్ 2 ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అంటూ అడుగుతున్నారు. వీరడిగిన అన్ని ప్రశ్నలకు డైరెక్టర్ ఆనంద్ రంగా సమాధానం చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X