తన బయోపిక్‌పై పీవీ సింధు స్పందన.. సమంతకు షాక్! అంత మాట అనేసిందేంటి..?
Recommended Video
నాగ చైతన్యతో పెళ్లి తర్వాత మంచి జోష్‌లో ఉంది అక్కినేని సమంత. వరుస సినిమాలతో బిజీ అయిన ఈమె ఇటీవలే 'ఓ బేబీ' రూపంలో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం '96' రీమేక్ లో నటిస్తోంది. కాగా గత కొన్ని రోజులుగా సమంత, భారత బ్యాట్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు బయోపిక్ లో నటించనుందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీవీ సింధు తన బయోపిక్ పై స్పందించడం చర్చనీయాంశంగా మారింది.

పీవీ సింధు బయోపిక్ కోసం రంగం సిద్ధం
అంతర్జాతీయ బ్యాట్మింటన్ పోటీల్లో తెలుగు తేజం పీవీ సింధు విశేష ఖ్యాతి తెచ్చుకుంటోంది. గతంలో అనేక పతకాలు చేజిక్కించుకొని తన టాలెంట్ చూపించిన ఈమె.. ఇటీవలే జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో స్వర్ణం గెలిచి భారత దేశ కీర్తి పతాకాన్ని ఎగరవేసింది. దీంతో కొందరు దర్శకనిర్మాతలు పీవీ సింధు జీవితానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే పీవీ సింధు బయోపిక్ తీయాలని డిసైడ్ అయ్యాడు సోనుసూద్.

సమంత కన్ఫర్మ్..
అయితే ఈ బయోపిక్ లో టాలీవుడ్ టాప్ హీరోయిన్ అక్కినేని సమంతను కన్ఫర్మ్ చేసినట్లుగా వార్తలు వినిపించాయి. పీవీ సింధు పాత్రలో సమంత బాగా సూట్ అవుతుందని సోనుసూద్ కూడా భావిస్తున్నాడని, ఇందుకోసం ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిసింది. ఇంతలో తన బయోపిక్ విషయమై స్వయంగా పీవీ సింధు స్పందించి షాకిచ్చింది.

తెరపైకి దీపికా పదుకోనే పేరు
ఇటీవలే ఓ మీడియాతో ముచ్చటించి పీవీ సింధు.. వెండితెరపై తన పాత్రలో బాలీవుడ్ భామ దీపికా పదుకోనే నటిస్తే బాగుంటుందని చెప్పింది. అంతేకాదు దీపికా బ్యాడ్మింటన్ బాగా ఆడుతుందని అంతకు మించిన మంచి నటి కూడా అని కితాబిచ్చాంది పీవీ సింధు. దీంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

స్పెయిన్‌లో సమంత ఎంజాయ్
నాగార్జున పుట్టినరోజు వేడుక నిమిత్తం గత వారమే అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి స్పెయిన్‌లోని ఐబిజాకు వెళ్లారు. నాగార్జున సహా నాగచైతన్య, సమంత, అఖిల్, నాగార్జున, అమల తదితరులు ఐబిజా ట్రిప్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా టూర్‌కు సంబంధించిన అప్‌డేట్స్, అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ వస్తోంది సమంత.


Click it and Unblock the Notifications











