RDX లవ్ ఫస్ట్ రివ్యూ: బోల్డ్ డైలాగ్స్.. సేఫ్టీ సెక్స్.. ఆసక్తికర మలుపులు

హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నిర్మించిన 'RDX లవ్' చిత్రం ఈ రోజే (అక్టోబర్ 11) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. శంకర్ భాను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో 'హుషారు' మూవీ ఫేం తేజస్, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా నటించారు. రాధన్ సంగీతం అందించగా రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ హ్యాండిల్ చేశారు.

2 గంటల 25 నిమిషాల రన్ టైమ్.. ఆసక్తికర కథనం

2 గంటల 25 నిమిషాల రన్ టైమ్.. ఆసక్తికర కథనం

2 గంటల 25 నిమిషాల రన్ టైమ్ తో విడుదలైన ఈ సినిమా ఆసక్తికర కథా, కథనంతో సాగిపోయింది. చంద్రన్నపేట అనే గ్రామంలో అలివేలుగా పాయల్ అదరగొట్టేసింది. ఊరి కోసం పాటుపడే యువతిగా పాయల్ నటన ఆకట్టుకుందని, విలన్ గా ఆదిత్య మీనన్ నటన సినిమాకు ప్లస్ అయిందనే టాక్ వస్తోంది.

బోల్డ్ సన్నివేశాలు.. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్

బోల్డ్ సన్నివేశాలు.. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్

RDX లవ్ సినిమాలో బోల్డ్ సన్నివేశాలకు, బోల్డ్ డైలాగ్స్ కొదవే లేదని తెలిసింది. సేఫ్టీ సెక్స్ కోసం, జనాభా నియంత్రణ పై ఎడ్యుకేట్ చేసే నేపథ్యంలో వచ్చిన సన్నివేశాల్లో మాస్ మాసాలా సీన్స్ పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. హీరో హీరోయిన్ మధ్య సాగే లవ్ ట్రాక్ యూత్ ఆడియన్స్‌కి కిక్కిచ్చేలా ఉందని తెలుస్తోంది.

పాయల్ వింత ప్రవర్తన

పాయల్ వింత ప్రవర్తన

సేఫ్టీ సెక్స్ గురించి చెప్పే క్రమంలో పాయల్ చెప్పిన డైలాగ్స్ కొంచెం బోల్డ్ గా ఉన్నప్పటికీ ఆమె క్యారెక్టర్ సినిమాకే హైలైట్ గా నిలిచిందని అంటున్నారు. జబర్దస్త్ కమెడియన్ చమ్మక్ చంద్ర, హీరో తేజుస్ మధ్య హాస్య సన్నివేశాలు, పోలీస్ గా ముమైత్ ఖాన్ ఎంట్రీ, పాయల్ వింత ప్రవర్తన సినిమాను ఆసక్తికరంగా మార్చేసిందని తెలిసింది.

Recommended Video

'You Need A Condom Before Going Into Bed' : Payal Rajput || సేఫ్టీ పై పాయల్ రాజ్‌పుత్ కామెంట్స్
సినిమాకు పాజిటివ్ అంశాలు

సినిమాకు పాజిటివ్ అంశాలు

కథలో ఆసక్తికర మలుపు ఉన్నాయని, విరామం తరువాత కథపై ఓ క్లారిటీ వస్తుందని అంటున్నారు. హీరోను ప్రేమించిన కారణంగా పాయల్ చిత్రహింసలకు గురికావడం, ఊరి కోసం పాటు పడటం, విలన్ గా ఆదిత్య మీనన్ పర్‌ఫార్‌మెన్స్, చివరిదాకా కొనసాగిన మిస్టరీ సినిమాకు పాజిటివ్ అనే టాక్ బయటకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X