పాయల్ రాజ్‌పుత్ కన్ఫర్మ్ చేసింది.. RDX లవ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇక రచ్చ రచ్చే..!
RX100 ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పంజాబీ పాప పాయల్ రాజ్‌పుత్.. ఈ సారి RDX లవ్ లవ్ రూపంలో రంగంలోకి దిగుతోంది. ముద్దు సీన్లు, శృంగార సీన్లతో సెన్సేషన్ క్రియేట్ చేయడంలో తనకు సాటి ఎవ్వరూ రారంటూ తొలి సినిమాతోనే గ్లామర్ డాల్‌గా ముద్ర వేసుకున్న పాయల్.. RDX లవ్ రూపంలో వచ్చే సమయం ఆసన్నమైంది. ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.
అక్టోబర్ 11వ తేదీన RDX లవ్ విడుదల చేయనున్నట్లుగా అఫీషియల్‌గా ప్రకటించారు దర్శకనిర్మాతలు. ఊరి కోసం పాటుపడే మహిళగా ఈ సినిమాలో కనిపించనుంది పాయల్. స్టోరీ లైన్‌తో పాటు యూత్‌కి కావాల్సిన అన్ని అంశాలు మేళవించి ఈ సినిమాను రూపొందించారు మేకర్స్. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాయల్ లుక్స్ బాగా ఆకట్టుకోవడంతో
ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

'RDX లవ్' చిత్రాన్ని హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నిర్మించారు. శంకర్ భాను దర్శకత్వం వహించారు. 'హుషారు' మూవీ ఫేం తేజస్, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా నటించారు. నరేష్, నాగినీడు, తులసి, ఆమని ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. రాధన్ సంగీతం అందించగా, రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ హ్యాండిల్ చేశారు.


Click it and Unblock the Notifications











