మొన్న రొమాన్స్.. నేడు కబడ్డీ.. అన్నీ చెప్పేసిన పాయల్ రాజ్‌పుత్
RX100 సినిమాతో టాలీవుడ్ జనాన్ని పలకరించింది పాయల్ రాజ్‌పుత్. తొలి సినిమాలోనే అందాల విందు ఇస్తూ.. ముద్దు సీన్లు, శృంగార సీన్లతో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ పంజాబీ పాప. ఈ దెబ్బతో పాయల్‌కు టాలీవుడ్ అవకాశాలు వెల్లువెత్తాయి. పాయల్ అందాలకు ఫిదా అయిన దర్శక నిర్మాతలు ఆమెకు వరుస అవకాశాలు ఇచ్చేశారు. రొమాన్స్, ముద్దు సన్నివేశాల్లో నటించడానికి ఏ మాత్రం నో చెప్పకపోవడం ఈమె ప్రత్యేకత. ఈ నేపథ్యంలోనే RDX లవ్ అనే కొత్త చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ ఓ రేంజ్ హంగామా చేసేసింది.

RDX లవ్ రొమాంటిక్ కిక్
గత సినిమా RX100 తో పోల్చితే ప్రస్తుత సినిమా RDX లవ్ లో రొమాంటిక్ డోస్ బాగా పెంచేసింది పాయల్ రాజ్‌పుత్. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ టీజర్‌లో శృంగారం, సేఫ్టీలు, స్వర్గం గురించే చెప్పడం చూస్తుంటే 'RDX లవ్' సినిమాలో రొమాన్స్ డోస్ ఏ రేంజ్‌లో ఉండనుందో తెలుస్తోంది.

బలవంతులతో కబడ్డీ ఆడేస్తూ
ఇదిలా ఉంటే తాజాగా 'RDX లవ్' సినిమాకు సంబందించిన మరింత సమాచారం తెలుపుతూ బలవంతులతో కబడ్డీ ఆడుతున్న పిక్ షేర్ చేసింది పాయల్. ప్రతీ రోజు ధైర్యంగా ఉండటం కంటే గొప్ప మరేదీ లేదని ఆమె పేర్కొంది. చిత్రంలో తనది అలివేలు పాత్ర అని రివీల్ చేసింది పాయల్. పల్లెటూరి పిల్లగా ఈ సినిమాలో నటిస్తున్నానని పేర్కొంది.
రెండో ఆలోచన లేకుండా వెంటనే..
'RDX లవ్' మూవీ స్క్రిప్ట్ వినగానే రెండో ఆలోచన లేకుండా వెంటనే ఓకే చెప్పేశానని తెలిపింది పాయల్. ఇదో పల్లెటూరి అమ్మాయి యొక్క బ్యూటిఫుల్ స్టోరీ అని, తన గ్రామాన్ని రక్షించడానికి ఆ అమ్మాయి చేసే పోరాటమే ఈ సినిమా అని ఓకే ఒక్క లైన్ లో స్టోరీ అంతా చెప్పేసింది పాయల్. ఈ రకంగా ఈ సినిమాలో రొమాన్స్ తో పాటు మంచి స్టోరీ కూడా ఉందనే విషయం చెప్పేసింది ఈ పంజాబీ పాప.

'RDX లవ్' మూవీ
'RDX లవ్' చిత్రానికి శంకర్ భాను దర్శకత్వం వహించగా.. హ్యాపీ మూవీస్ పతాకంపై సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. హుషారు ఫేం తేజస్ హీరోగా నటించాడు. ఈ చిత్రంలో ముమైత్ ఖాన్ ప్రత్యేక గీతంలో అభిమానులను ఎంటర్‌టైన్ చేయబోతోంది. రాధన్ సంగీతం అందిస్తుండగా, రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ హ్యాండిల్ చేశారు. అతిత్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











