RDX లవ్ ట్రైలర్: ఓ ఆడపిల్ల పక్కన మగాడుంటే.. మరింత రెచ్చిపోయిన పాయల్ రాజ్‌పుత్

Recommended Video

RDX Love Release Trailer

పంజాబీ పాప పాయల్ రాజ్‌పుత్ తాజా సినిమా RDX లవ్. ముద్దు సీన్లు, శృంగార సీన్లతో సెన్సేషన్ క్రియేట్ చేసి.. తొలి సినిమా Rx100 గ్లామర్ డాల్‌గా ముద్ర చేసుకున్న ఈ హాట్ బ్యూటీ RDX లవ్ చిత్రంలో మరింత రెచ్చిపోయింది. అక్టోబర్ 11వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్‌లో చూపించిన సన్నివేశాలు సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఆ వివరాలు చూద్దామా..

కుర్రకారు మతిపోగెట్టే విధంగా.. హాట్ ట్రీట్

కుర్రకారు మతిపోగెట్టే విధంగా.. హాట్ ట్రీట్

'RDX లవ్' చిత్రానికి సంబంధించి ఇప్పటికే కుర్రకారు మతిపోగెట్టే లుక్స్ విడుదల చేశారు మేకర్స్. పాయల్ రాజ్‌పుత్ అందాలను ఎలివేట్ చేస్తూ ఆమె నాజూకు నడుము, ఎద అందాలతో కూడిన కిక్కిచ్చే లుక్స్ వదిలి ఔరా అనిపించారు. దీంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు క్రియేట్ అయ్యాయి.

కొనసాగింపు కూడా మామూలుగా లేదు

కొనసాగింపు కూడా మామూలుగా లేదు

ఇక ఇటీవలే 'RDX లవ్' ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రయూనిట్.. అంచనాలు రెట్టింపు చేసేలా 'RDX లవ్' టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో కేవలం శృంగారాన్నే ఎక్కువగా ఫోకస్ చేస్తూ యూత్ ఆడియన్స్‌లో ఆతృతను పెంచారు. టీజర్ అంతా శృంగారం, సేఫ్టీలు, స్వర్గం గురించే చెప్పడం కారణంగా ఈ సినిమా ట్రైలర్ కోసం ఎదురు చూసింది యూత్ అంతా.

ఓ ఆడపిల్ల పక్కన మగాడుంటే.. ట్రైలర్ హంగామా

ఓ ఆడపిల్ల పక్కన మగాడుంటే.. ట్రైలర్ హంగామా

యువతకు స్పెషల్ కిక్ ఇస్తూనే టీజర్‌కి కాసింత డిఫరెంట్‌గా ట్రైలర్ కట్ చేశారు మేకర్స్. తాజాగా విడుదల చేసిన ఈ ట్రైలర్‌లో సీరియస్ సన్నివేశాలు, పాయల్ రాజ్‌పుత్ ఫైట్ సీన్స్‌తో పాటు పాయల్ రొమాంటిక్ డోస్ కూడా చూపించారు. దీంతో 'RDX లవ్' సినిమాలో రొమాంటిక్ కిక్‌తో పాటు పాయల్ పర్‌ఫార్‌మెన్స్ కూడా హైలైట్ కానుందని అర్థమవుతోంది.

రెండో ఆలోచన లేకుండా వెంటనే..

'RDX లవ్' మూవీ స్క్రిప్ట్ వినగానే రెండో ఆలోచన లేకుండా వెంటనే ఓకే చెప్పేశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది పాయల్. ఇదో పల్లెటూరి అమ్మాయి బ్యూటిఫుల్ స్టోరీ అని, తన గ్రామాన్ని రక్షించడానికి ఆ అమ్మాయి చేసే పోరాటమే ఈ సినిమా అని ఓకే ఒక్క లైన్‌లో స్టోరీ అంతా చెప్పేసింది పాయల్. ఈ సినిమాలో రొమాన్స్‌తో పాటు మంచి స్టోరీ కూడా ఉందనే విషయం చెప్పేసింది ఈ పంజాబీ పాప.

'RDX లవ్' మూవీ

'RDX లవ్' మూవీ

'RDX లవ్' చిత్రానికి శంకర్ భాను దర్శకత్వం వహించగా.. హ్యాపీ మూవీస్ పతాకంపై సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. హుషారు ఫేం తేజస్ హీరోగా నటించాడు. ఈ చిత్రంలో ముమైత్ ఖాన్ ప్రత్యేక గీతంలో అభిమానులను ఎంటర్‌టైన్ చేయబోతోంది. రాధన్ సంగీతం అందిస్తుండగా, రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ హ్యాండిల్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X