శేఖర్ బాషా అరాచకాలు.. సాక్ష్యాలతో సిద్ధంగా ఉన్నా.. ఆ అమ్మాయిలను ఇలా చేశాడు!
ఆర్జే గా ఫేమ్ సంపాదించుకున్న శేఖర్ భాష బిగ్ బాస్ రియాలిటీ షోతో మంచి క్రేజ్ దక్కించుకున్నారు. అక్కినేని నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్ గా టీవీ ఆడియెన్స్ ను అలరించారు. హౌజ్ నుంచి బయటికి వచ్చాక మాత్రం ఆయనపై ఊహించని విధంగా వార్తలు వినాల్సి వస్తోంది. ప్రస్తుతం ఆయన అమ్మాయిలతో సంబంధాలు కలిగి ఉన్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలు ఆడియో కాల్స్ లీక్ చేశాడని యంగ్ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య కేసు విషయంలో ఆయన పేరు వినిపించింది. పలు ఆడియో కాల్స్ లీక్ చేస్తున్నాడనే ఆరోపణలతో లావణ్య కేసు కూడా నమోదు చేయించింది.
ఇదిలా ఉండగా.. రీసెంట్ గా శేఖర్ బాషపై మరో కేసు కూడా నమోదైంది. జానీ మాస్టర్ కేసు విచారణ జరుగుతున్న సందర్భంలో శేఖర్ బాషా కావాలనే తన కాల్ రికార్డ్స్ ను లీక్ చేశారని శ్రేష్టి వర్మ ఫిర్యాదు చేసింది. ఇలా వరుస కేసులతో శేఖర్ బాష పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో మారుమోగుతోంది. మరోవైపు శేఖర్ బాష కూడా తన వెర్షను వినిపిస్తూ పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూనే వస్తున్నారు. సంచలన ఆడియో కాల్స్ ను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రీసెంట్ గా పడాల లక్ష్మికి సంబంధించిన ఆడియోను విడుదల చేశారాయన.

దీనిపై తాజాగా పడాల లక్ష్మి స్పందించింది. శేఖర్ బాష అరాచకాలు అంటూ పలు సంచలన విషయాలను తెలియజేసింది. సౌమ్య అనేఅమ్మాయితో పెళ్లి, ఆమె చెల్లితో అక్రమసంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. అలాగే భార్గవి, గీత తో పాటు చాలా మంది అమ్మాయిలు ఆయన ఖాతాలో ఉన్నారని తెలిపింది. ఓ అమ్మాయిని కూడా హత్య చేరాని ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించి ఆమె దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని తెలిపింది. మరోవైపు శేఖర్ బాషకు తోడు ఓ ఎస్పీ కూడా వేధిస్తున్నారని ఆమె మీడియాకు తెలియజేశారు.
శేఖర్ బాష వల్లే చాలా మంది అమ్మాయిలు బలయ్యారని తెలిపింది. ఆయన చేసిన విషయాలను పక్కనపెట్టి ఆమెపై కావాలనే పడుతున్నారని మండిపడ్డారు. ఇక డబ్బులు లాగాననే ఆరోపణలు అవాస్తవం అన్నారు. కావాలంటే బ్యాంక్ అకౌంట్స్ వివరాలు ఇస్తానని చెక్ చేయాలని కోరింది. అప్పుడు వాస్తవాలు బయటపడుతాయని తెలిపింది. ఇక తనపై కేసులు పెట్టడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఎస్పీకి సంబంధించిన ఆధారాలున్న ఫోన్ ను కూడా వాళ్లు లాగేసుకున్నారని చెప్పుకొచ్చింది. కొద్దిరోజులు ఈ న్యూస్ మెల్లమెల్లగా ముదురుతోంది. ఇక దీనిపై శేఖర్ బాష ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు లావణ్య కేసు, అలాగే కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ కేసు విచారణలో ఉన్నాయి. వీటితో పాటు మొన్నటి వరకు బయటికి రాని పడాల లక్ష్మి ఇఫ్పుడు ఏకంగా మీడియా ముందుకే రావడంతో ఇష్యూ మరింతగా ముదురుతోంది.


Click it and Unblock the Notifications











