శర్వానంద్-సాయి పల్లవి సినిమాకు దిమ్మ దిరిగే బిజినెస్!
శర్వానంద్, సాయి పల్లవి జంటగా రూపొందుతున్న ప్రేమ కథా చిత్రం 'పడి పడి లేచె మనసు'. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే సినిమా రిలీజ్ ముందే... ఊహించని స్థాయిలో భారీగా బిజినెస్ జరుగుతోంది.
శర్వానంద్, సాయి పల్లవి సినిమాలకు మంచి క్రేజ్ ఏర్పడిన నేపథ్యంలో శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి,. వీటి రూపంలో నిర్మాతకు రూ. 12 కోట్ల ఆదాయం వచ్చింది. థియేట్రికల్ బిజినెస్ కాకుండా ఇతర రైట్స్ రూపంలోనే ఇంత మొత్తం రావడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ అమేజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా... శాటిలైట్ రైట్స్ స్టార్ మాటీవీ వారు దక్కించుకున్నారు. శర్వానంద్ కెరీర్లో శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలో ఇంత భారీ మొత్తం రావడం ఇదే తొలిసారి.

'పడి పడి లేచె మనసు' కోల్‌కతా నేపథ్యంలో సాగే ఒక రొమాంటిక్ మూవీ. హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. టీజర్, టైటిల్ సాంగ్ ఇటీవల విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫుట్ బాల్ ప్లేయర్ గా శర్వానంద్ .. డాక్టర్ గా సాయిపల్లవి నటిస్తోంది.
ఈ చిత్రంలో సునీల్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బేనర్లో సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నటీనటులుం శర్వాంనంద్, సాయి పల్లవి, మురళీ శర్మ, సునీల్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ప్రియా రామన్
దర్శకత్వం: హను రాఘవపూడి
నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి
బేనర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
సంగీతంం విశాల్ చంద్రశేఖర్
డిఓపి: జయకృష్ణ గుమ్మడి
ఎడిటర్: ఎ శ్రీకర్ ప్రసాద్
కొరియోగ్రఫీ: రాజు సుందరం
లిరిక్స్: కృష్ణ కాంత్


Click it and Unblock the Notifications











