‘పడిపడి లేచె మనసు’ ట్రైలర్: అంచనాలు పెంచిన శర్వానంద్, సాయి పల్లవి!

Recommended Video

Padi Padi Leche Manasu Theatrical Trailer

'నా పేరు సూర్య... పేరులో ఉన్న వెలుగు జీవితంలో మిస్సయి సంవత్సరం అవుతోంది. ఏడాది పాటు చీకటితో నేను చేసిన యుద్ధంలో ఇంకా బ్రతికి ఉన్నానంటే కారణం వైశాలి' అంటూ హీరో శర్వానంద్ తన తాజా చిత్రం 'పడిపడి లేచె మనసు' ట్రైలర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో ప్రేమలోని ఒక సరికొత్త కోణాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నట్లు ట్రైర్ చూస్తే స్పష్టం అవుతోంది. శర్వానంద్ నటన, సాయి పల్లవికి ఉన్న క్రేజ్ వెరసి ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

పడి పడి లేచె మనసు

పడి పడి లేచె మనసు

కోల్‌కతా నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథా చిత్రంలో శర్వానంద్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా, సాయిపల్లవి డాక్టర్ పాత్ర కనిపించనున్నారు. ట్రైలర్ చూస్తుంటే ఇద్దరి మధ్య లవ్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్లు స్పష్టమవుతోంది.

 స్టోరీ ట్విస్ట్ ఏమిటో?

స్టోరీ ట్విస్ట్ ఏమిటో?

అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాధ, లై లాంటి చిత్రాలు రూపొందించిన హను రాఘవపూడి..... కమర్షియల్ సక్సెస్ అందుకోలేక పోయినా మేకింగ్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా అతడి సినిమాల్లో ఉండే ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.అయితే ‘పడి పడి లెచె మనసు' లో ఎలాంటి ట్విస్ట్ ఉండబోతోంది? అనేది ఆసక్తికరంగా మారింది.

ఎమోషనల్ లవ్ స్టోరీ

ఎమోషనల్ లవ్ స్టోరీ

ట్రైలర్ చూస్తుంటే.... శర్వానంద్, సాయి పల్లవి మధ్య వచ్చే కొన్ని సీన్లు మనసు పిండేసేలా ఎమోషనల్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాలోని పాయింట్ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు రాబట్టే అవకాశం ఉంది.

డిసెంబర్ 21న రిలీజ్

'పడి పడి లేచె మనసు డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ సంస్థ‌లో సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్నఈ చిత్ర పాట‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X