Padma Awards 2025: బాలకృష్ణకు పద్మభూషణ్.. ఇంకా ఎవరెవరికి అవార్డులు వచ్చాయంటే?
దేశంలోనే కాకుండా విదేశాల్లో వివిధ రంగాల్లో రాణిస్తున్న ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం పద్మా అవార్డులను ప్రకటించింది. ఈ సంవత్సరం తెలుగు వారికి మంచి గుర్తింపు లభించింది. పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డులు దక్కాయి. ఈసారి అవార్డులు అందుకొన్న వారిలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఉన్నారు. ఇంకా ఈ అవార్డును గెలుచుకొన్న తెలుగు వారు ఎవరంటే?
మొత్తం ఎంత మందికి పద్మ అవార్డులు అంటే?
2025 సంవత్సరానికి ప్రకటించిన అవార్డుల వివరాలు ఇలా ఉన్నాయి. పద్మవిభూషణ్ అవార్డులను మొత్తం 7 గురుని ఎంపిక చేశారు. 19 మందికి పద్మ భూషణ్ అవార్డు, 113 మందికి పద్మ శ్రీ అవార్డును అందజేయనున్నారు. ఇందులో 23 మంది మహిళలు ఉండటం గమనార్హం. ఇక 10 విదేశీయులు, ఎన్నారైలు ఉండగా, 10 మంది మరణాంతరం ఈ అవార్డును అందుకోబోతున్నారు.

పద్మ విభూషణ్ ఎవరికంటే?
పద్మ విభూషణ్ అవార్డు అందుకొన్న వారిలో తెలంగాణకు చెందిన దువ్వూరి నాగేశ్వరరావు ఉన్నారు. వైద్య రంగంలో విశేష సేవలు అందించినందుకు గాను ఈ అవార్డును అందుకోనున్నారు.
పద్మభూషణ్ అవార్డులు ఎవరికంటే?
పద్మ భూషణ్ అవార్డు అందుకొన్న వారిలో ఆంధ్ర ప్రదేశ్ నుంచి నటుడు నందమూరి బాలకృష్ణ ఉండగా, సినీ రంగం నుంచి కర్ణాటకకు చెందిన నటుడు అనంతనాగ్ ఉన్నారు. అలాగే గాయకుడు పంకజ్ ఉదాస్ కూడా ఉండటం విశేషంగా మారింది. పంకజ్ ఉదాస్‌కు మరణాంతరం ఈ అవార్డు దక్కింది. అలాగే నటుడు అజిత్ కుమార్, దర్శకుడు శేఖర్ కపూర్ తదితరులు ఉన్నారు.
పద్మ శ్రీ అవార్డుల విషయానికి వస్తే..
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాహిత్యం, విద్యా రంగాలకు విశేష సేవలు అందిస్తున్న శ్రీ కేఎల్ కృష్ణ పద్మశ్రీ అవార్డులు దక్కింది. అలాగే పండితుడు మాడుగుల నాగఫణి శర్మకు కూడా పద్మ అవార్డు దక్కింది. అలాగే కళా రంగానికి చెందిన మిర్యాల అప్పారావు (మరణాంతరం), వడిరాజ్ రాఘవేంద్రచార్య పంచముఖి తదితరులు ఉన్నారు.


Click it and Unblock the Notifications











