For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బ్రా వేసుకోలేదని కామెంట్స్.. వారి సంతోషం కోసమే ఇప్పుడు ఇలా.. వీడియోతో హాట్ యాంకర్ సెటైర్

  |

  ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా గుప్పిట్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ వైరస్ దెబ్బకు అగ్రరాజ్య అమెరికా పూర్తిగా కుదేలైపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 21 లక్షల మంది కరోనా బారిన పడగా.. లక్షకుపైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్‌ను పాటిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. టాప్ సెలెబ్రిటీలు సైతం గడపదాటి అడుగు బయటకు పెట్టడం లేదు. ఇలాంటి స్థితిలో ఇంట్లోనే ఉంటూ తమకు నచ్చిన పనిని చేసుకుంటూ కాలాన్ని గడిపేస్తున్నారు. అలా తనకు వచ్చిన, తెలిసిన పనిని చేస్తోన్న ఓ సెలెబ్రిటీని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. వాటికి ఆమె తనదైన శైలిలో సమాధానమిచ్చింది. ఇంతకీ ఆ కథాకమామీషు ఏంటో ఓ సారి చూద్దాం.

   సెలెబ్రిటీలంతా ఇంట్లోనే..

  సెలెబ్రిటీలంతా ఇంట్లోనే..

  స్టార్ హీరోలు హీరోయిన్స్ అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు. లాక్ డౌన్ విధించడంతో అందరూ ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది. ఇలా తమకు అనుకోకుండా దొరికిన ఈ ఖాళీ సమయాన్ని అందరూ బాగానే ఉపయోగించుకుంటున్నారు. వంటలు వండుతూ, డ్రాయింగ్, పెయింటింగ్, వ్యాయామం, యోగా వంటివి చేసుకుంటూ కాలాన్ని గడిపేస్తున్నారు.

  పలు రంగాల్లో ఫేమస్..

  పలు రంగాల్లో ఫేమస్..

  యాంకర్, నటి, మోడల్, టీవీ వ్యాఖ్యాత ఇలా అన్ని రంగాల్లో పేరు మోసిన పద్మా లక్ష్మీ అమెరికన్ టాప్ షెఫ్ రియాలిటీ షోతో బాగా ఫేమస్ అయింది. చెన్నైలో పుట్టినా అమెరికాలో పెరిగింది . ఈమె పూర్తి పేరు పార్వతి లక్ష్మి వైద్యనాధన్.

  టాప్ ఛెఫ్ హోస్ట్..

  టాప్ ఛెఫ్ ప్రోగ్రామ్‌ను హోస్ట్ చేసే పద్మకు వంటలు వండటం బాగా వచ్చు. కొత్త కొత్త రుచులను నెటిజన్లకు పరిచయం చేస్తూ ఉంటుంది. ఈమె సోషల్ మీడియాలోని ఖాతాలను పరిశీలిస్తే అది అర్థమవుతుంది. హాట్ హాట్ ఫోటోలతో పాటు, నోరూరించే వంటకాల చిట్కాలను పోస్ట్ చేస్తుంది. తాజాగా ఇదే విధంగా ఓ వీడియోను షేర్ చేస్తే... బ్రా వేసుకోలేదంటూ పెద్ద మొత్తంలో కామెంట్స్ వచ్చాయి.

  Megastar Chiranjeevi Hilarious Counter To Mohan Babu
  అలాంటి వారి కోసం రెండు ధరించా..

  అలాంటి వారి కోసం రెండు ధరించా..

  తనపై వచ్చిన కామెంట్లకు స్పందిస్తూ మరో కొత్త రెసిపీని పరిచయం చేస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. ‘ఇంతకు ముందు వీడియోకు బ్రా వేసుకోలేదని చాలామంది కామెంట్స్ చేశారు. ఇలాంటి క్వారంటైన్ సమయంలో నా వంటగదిలో బ్రా వేసుకోలేదని కామెంట్స్ పెట్టారు.. అలాంటి వారంతా జాగ్రత్తగా ఈ వీడియోను పరిశీలిస్తే సంతోషంగా ఉండొచ్చు..ఎందుకంటే నేను రెండు బ్రాలు వేసుకున్నాను..కానీ ఈ 2020లో కూడా మహిళ శరీరాన్ని ఇలా చూడటమా? అంటూ అసహానాన్ని వ్యక్తం చేసింది.

  English summary
  Padma Lakshmi satire On Comments To Not Wearing Bra. She Says That She got some comments last time that it was immoral for me to not wear a bra in my own kitchen during the quarantine. So those people should be happy to note that I’m wearing two today 😂) But seriously, let’s not police women’s bodies in 2020 ok.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X