Pages భారత, పాక్, తెలంగాణ నేపథ్యంతో.. ఇంటెన్స్ పొలిటికల్ థ్రిల్లర్‌గా పేజేస్

న్యూయార్క్‌ చెందిన రామ్ అల్లాడి అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్నారు. చిసెల్డ్, రాస్ మోటానోయా చిత్రాలను రూపొందించిన రామ్ అల్లాడి ఇంటర్నేషనల్ స్థాయిలో పలు పురస్కారాలను అందుకొన్నారు.తాజాగా పేజేస్ (హిందీలో పన్నే) అనే ఇంటెన్స్ పొలిటకల్ థ్రిల్లర్‌తో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యారు. ఇటీవలే విడుదలై టీజర్‌కు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వస్తున్నది. ఈ నేపథ్యంలో పేజేస్ సినిమా వివరాల్లోకి వెళితే..

Pages movie with Intense politcal Thriller by Ram Alladi with India and Pakistan and Telangana back drop

పాన్ ఇండియా జోరు కొనసాగుతున్న నేపథ్యంలో హిందీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు, ఆంగ్ల భాషలలో పేజెస్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందుతున్న పేజేస్‌లో కల్పనా తివారీ కీలక పాత్రను పోషిస్తున్నారు.

Pages movie with Intense politcal Thriller by Ram Alladi with India and Pakistan and Telangana back drop

పేజేస్ సినిమాకు వస్తున్న స్పందన నేపథ్యంలో దర్శకుడు రామ్ అల్లాడి మాట్లాడుతూ... 'సామాజిక స్వేచ్ఛకు, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య ఉన్న వ్యత్యాసం మా చిత్రంలో మరో ప్రధాన అంశం. స్వాతంత్య్రానంతర పరిణామాల వల్ల ప్రభావితమైన ఒక రాజకీయ కుటుంబం నేపథ్యంలో సాగే ఇది. ఢిల్లీ, భారత - పాకిస్తాన్ సరిహద్దు, బంగ్లాదేశ్‌లోని నవఖాలి, తెలంగాణ ప్రాంతాలతో ముడిపడిన కథ ఇది. రెండు దశాబ్దాల నా ప్రవాస భారతీయ జీవితం నన్ను కథ రాయడానికి ప్రభావితం చేసింది. ఇది పూర్తి స్థాయి కల్పిత కథ. ఈ చిత్రంలో కల్పనా తివారీతో పాటు మరో ముగ్గురు మహిళలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తున్నాం. కథ, స్క్రీన్‌ప్లే, ఛాయాగ్రహణం, సంగీతం ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తాయి'' అని అన్నారు.

Pages movie with Intense politcal Thriller by Ram Alladi with India and Pakistan and Telangana back drop

తారాగణం: కల్పనా తివారీ, పంకజ్ మున్షీ, ఆనంద్ రంగరాజన్, శిల్పా దాస్, ప్రసాద్ కమలనాభ, రవి వైద్, నీహరి మండలి, సుమంత ముఖర్జీ, విజయ మేరీ, మధు గుంటుపల్లి, అరుణశ్రీ సాదుల, నంద కిషోర్, దావూద్, యశ్వంత్ సాదుల, వి రాజనీత మధే, వి. ఎరుగురాల, సయ్యద్ మునీబ్, రోహిత్ సత్యన్, కె. భావన, కృష్ణ గోదా, సాయిబాబా యెంగల్దాస్, రామ్ వంగా తదితరులు
సంగీతం: శ్రీవర్ధన్ సాయి
ఎడిటర్: రుద్ర అల్లాడి
సినిమాటోగ్రఫీ: రామ్ అల్లాడి, కృష్ణ గుంటుపల్లి
డైలాగ్స్: దీప్తి గంగరాడే, దేవేష్ కుమార్ రాథోడ్
కథ, దర్శకత్వం: రామ్ అల్లాడి
నిర్మాణ సంస్థ: ఏ.ఆర్.ఐటి వర్క్స్ ఇండియా

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X