ఐశ్వర్యరాయ్‌ను అచ్చుగుద్దినట్టు.. జిరాక్స్ కాపీలా ఉన్న సుందరి ఎవరో తెలుసా?
ప్రపంచంలో మనుషులను పోలీని మనుషులు ఉండటం సహజం. ఆ విషయం గురించి కొత్తగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఒక మనిషిని పోలిన వారు ఏడుగురు ఉంటారనే విషయాన్ని మన పెద్దలు చెబుతుండటం తెలిసిందే. అయితే ఐశ్వర్యరాయ్‌ని పోలిన ఓ అందగత్తె ఇప్పుడు ఇంటర్నెట్‌లో సంచలనం రేపుతున్నది. ఆమె ఎవరంటే..
సల్మాన్ ఖాన్‌తో ఐశ్వర రాయ్ బ్రేకప్ తర్వాత స్నేహా ఉల్లాల్ అనే హీరోయిన్ తెరపైకి వచ్చింది. సల్మాన్ ఖాన్‌తోపాటు దక్షిణాదిలో కూడా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే తాజాగా పాకిస్థాన్‌కు చెందిన బ్లాగర్ అమ్నా ఇమ్రాన్ ఐశ్వర్యను పోలీ ఉండటమే కాకుండా ఏకంగా జిరాక్స్ కాపీలా కనిపిస్తుండటం సెన్సేషన్‌గా మారింది.

ఇన్స్‌టాగ్రామ్‌లో అమ్నా ఇమ్రాన్‌ను చూసిన వారంతా ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ మాదిరిగా ఉన్నావంటూ కామెంట్ చేస్తూ ఉంటే ఆమె గాలిలో తేలిపోతున్నది. ప్రస్తుతం ఆమె భారత జాతీయ మీడియాలో అమ్నా హాట్ టాపిక్‌గా మారిపోయింది. స్టార్ సెలబ్రిటీకి ఏ మాత్రం ఆమెకు తగ్గకుండా క్రేజ్ లభిస్తున్నది.
గతంలో కూడా టిక్‌టాక్ సట్ార్ అమ్ముజ్ అమృత, ఇరాన్ మోడల్ మహలాగా జబేరీ కూడా ఐశ్వర్య రాయ్‌ను పోలీ ఉన్నారనే వార్తలు రావడం తెలిసిందే.


Click it and Unblock the Notifications











