Don't Miss!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్‌కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Sports T20 వరల్డ్ కప్‌కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
'ప్రభాస్'.. కామెంట్ చేసిన పాకిస్థాన్ హీరోయిన్.. హాట్ టాపిక్
ఓ తెలుగు హీరో ప్రపంచ ఆడియన్స్, సెలబ్రిటీల చూపును ఆకర్షించడమంటే మామూలు విషయం కాదు. కానీ ఇది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్కడికి మాత్రం చాలా సులువైన విషయం. ఇప్పటికే 'బాహుబలి' సినిమాతో ప్రపంచ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసిన ఈ యంగ్ హీరో సాహో రూపంలో మరో భారీ సినిమాతో ప్రభంజనం సృష్టించబోతున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసుకున్న సాహో మూవీ ఆగస్టు 15న విడుదలకు సిద్ధమైంది.
ఓ వైపు ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ ఇటీవలే 'సైకో సయ్యా' అనే బ్యూటిఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది. ఈ సాంగ్‌లో ప్రభాస్, శ్రద్ద కపూర్ పర్ఫార్మెన్స్ పీక్ స్టేజ్ లో ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ సాంగ్. వేగంగా వ్యూస్ రాబడుతూ రికార్డు యు ట్యూబ్ సెన్సేషన్ అవుతోంది. అయితే తాజాగా ఈ సాంగ్ చూసి ఫిదా అయిన పాకిస్థాన్ హీరోయిన్ మవ్ర హికెన్ ట్విట్టర్ వేదికగా స్పందించింది. సైకో సయ్యా ''ప్రభాస్'' అని ట్యాగ్ చేస్తూ లవ్ ఎమోజీలు పోస్ట్ చేసింది. ఈ పాకిస్థానీ హీరోయిన్ బాలీవుడ్ లో 'సనమ్ తేరీ కసమ్' సినిమాలో నటించింది. సో.. ఇలా ఓ హీరోయిన్ ప్రభాస్ గురించి ప్రస్తావించడం జనాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Prabhassss!!!!! 😍😍😍😍 🔥#PsychoSaiyaan
— MAWRA HOCANE (@MawraHocane) July 13, 2019
ఇక సాహో విశేషాలు చూస్తే.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో సాహో తెరకెక్కుతోంది. చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్ లాంటి భారీ తారాగణం ఈ చిత్రంలో పాలు పంచుకుంటున్నారు. వరల్డ్ వైడ్ ఆడియన్స్ చూపు సాహో పై ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.