Bhagavanth Kesari: బాలయ్య మూవీలో మరో హీరోయిన్.. అదే అసలైన ట్విస్ట్
టాలీవుడ్‌లో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో నటిసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. అలాంటిది రెండేళ్ల క్రితమే ఆయన 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. దీంతో ఆయనలో జోష్ రెట్టింపు అయింది. ఈ ఉత్సాహంతోనే గత సంక్రాంతికి గోపీచంద్ మలినేని తెరకెక్కించిన 'వీర సింహా రెడ్డి' అనే సినిమాతో వచ్చారు. దీనికి కూడా అన్ని వర్గాల ఆదరణ లభించింది. ఫలితంగా ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో బాలయ్య దూసుకుపోతోన్నారు.
నటిసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి 'భగవంత్ కేసరి' అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఫుల్ లెంగ్త్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తగ్గకుండా చిత్ర యూనిట్ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. ఇందులో భాగంగానే ఈ మూవీ షూటింగ్‌ను అస్సలు బ్రేకులు లేకుండా శరవేగంగా జరుపుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'భగవంత్ కేసరి' సినిమాలో కాజల్ అగర్వాల్ ప్రధాన హీరోయిన్‌గా, శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో మరో యంగ్ బ్యూటీ కూడా భాగం అయిందట. ఆమె ఎవరో కాదు.. గతంలో తెలుగులో 'అబ్బాయితో అమ్మాయి', 'జువ్వ', 'క్రేజీ క్రేజీ ఫీలింగ్' వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన పల్లక్ లల్వానీ అని తెలిసింది. ఆమె పాత్ర కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందట. ఈ హీరోయిన్ పాత్ర రివీల్ అయ్యేప్పుడు వచ్చే ట్విస్ట్ అదిరిపోతుందట. అందుకే దీన్ని సస్పెన్స్‌గా ఉంచారని తెలిసింది.

ఇదిలా ఉండగా.. 'భగవంత్ కేసరి' మూవీని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే దసరాకు విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి పార్టును చిత్రీకరిస్తున్నారు. అది పూర్తైన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను మొదలు పెడతారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











