twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పలాస 1978 గొప్ప సినిమా.. ఆయనను చూస్తే రావు గోపాల్ రావులా అనిపించారు..

    |

    నూతన తారలు రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'పలాస 1978'. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్‌ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా మార్చి 6న విడుదల కానుంది. రక్షిత్, నక్షత్ర హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. విడుదలకు ముందే ఇండస్ట్ర్రీ లో కొత్తతరహా సినిమా గా ప్రశంసలు అందుకున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. యువ హీరోలు నాగశౌర్య, శ్రీ విష్ణు, దర్శకుడు మారుతి ప్రత్యేక అతిథులుగా హాజరై టీం ని అభినందించారు. తెలుగు సినిమా కథలు మళ్లీ మూలాల వైపు అడుగులు వేస్తున్నాయనడానికి నిదర్శనంగా 'పలాస 1978' నిలవబోతుందనే టాక్ బాగా వినిపడతుంది. మ్యూజిక్ దర్శకుడు కళ్యాణ్ మాలిక్, రచయిత సిరాశ్రీ, నిర్మాతలు రాజ్ కందుకూరి, మధురశ్రీధర్ ఈ వేడుకకు హాజరై టీం ని అభినందించారు.

    ఈ సందర్భంగా
    మ్యూజిక్ దర్శకుడు కళ్యాణ్ మాలిక్ మాట్లాడుతూ: 'రఘు కుంచె గారు నాకు చిరకాల మిత్రుడు ఆయన నటించిన మ్యూజిక్ అందిచిన మూవీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. నిరుత్సాహ పడని నిరీక్షణతో ఉంటారు రఘ కుంచె గారు. ఆయన నటిస్తున్నాడని తెలిసి ట్రైలర్ చూసాను.. ఆయన ముత్యాల ముగ్గులో రావు గోపాల్ రావు గారిలా అనిపించారు. ఆయన విలనీ కూడా అందంగా ఉంటుంది. ఈ పాటలలో 'నక్కిలీసు గొలుసు ' నా ఫావరేట్. రఘు కుంచె
    గారితో పాటు టీం అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను ' అన్నారు.

    Palasa 1978 pre release event: Maruthi comments goes viral

    దర్శకుడు మారుతి మాట్లాడుతూ:
    'పలాస ఫస్ట్ కాపీ చూసిన రోజు దర్శకుడు కుమార్ ఒక అద్భుతం చేసాడని పించింది. మనం ఊహించిన దానికంటే చాలా బాగా తీసాడు..ప్రతి మేకర్ కి ఇలాంటి సినిమా చేయాలనిపించేలా చేసాడు. ఈ సినిమా కి యాక్టర్స్ లో అందరూ బాగా జీవించారు. అందులో రఘుకుంచె గారి నటన, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. తమిళ సినిమాలు చూసి మనం ఫీల్ అవుతుంటాం.. వెట్రిమారన్ లాంటి వారిని చూసి ఇన్స్‌ఫైర్ అవుతుంటాం.. కానీ మనకూ అలాంటి దర్శకులున్నారు అని కరుణ్ కుమార్ గుర్తు చేసాడు. ఈ సినిమా చూసి అందరూ మాట్లాడతారు' అన్నారు.

    రాజ్ కుందుకూరి మాట్లాడుతూ:
    ' తెలంగాణా భాష తీసుకోని పెళ్ళి చూపులు తీసినట్లు.. వీళ్ళు ఉత్తరాంధ్ర లోని పలాస ప్రాంతాన్ని తీసుకోని 'పలాస1978' తీసారనిపించింది. ఈ సినిమా చూసిన వారందరికీ ఆ పాత్రలు గుర్తిండిపోతాయి. ఈ సినిమా నిర్మించిన ప్రసాద్ గారికి , హీరో రక్షిత్ , నక్షత్ర నటన బాగుంది. రఘుకుంచె నటన విశ్వరూపం చూపించాడు. టీం కి ఆల్ ద బెస్ట్ ' అన్నారు.

    తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ:
    'దర్శకుడు కరుణ్ చెప్పినప్పుడు బాగుంది కానీ ఎవరు చేస్తారు అనుకున్నాను.. నిర్మాత ప్రసాద్ గారికి పంపాను. రక్షిత్ ఈ క్యారెక్టర్ బాగుంటాడు అనుకున్నాను. నన్ను సమర్పకుడిగా చేసినప్పుడు కొంచెం కంగారు పడ్డాను. 40 యేళ్ళ నా కెరియర్ లో ఇదే బెస్ట్ సినిమా అని నమ్మకంగా చెప్పగలను. ఈ సినిమా పోస్టర్ పై నా పేరు ఉన్నందుకు గర్వ పడుతున్నాను. ఇందులో చేసిన ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి చేసారు. డిఫరెంట్ కథలను ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఈసినిమాను కూడా ఆశ్వీర్వదిస్తారు అని నమ్ముతున్నాను' అన్నారు.

    పాటలు : భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల,
    ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు,
    సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్,
    సంగీతం : రఘు కుంచె,
    కో ప్రొడ్యూసర్ : మీడియా 9 మనోజ్
    పి.ఆర్.ఓ : జి.ఎస్.కె మీడియా,
    నిర్మాత : ధ్యాన్ అట్లూరి.
    రచన- దర్శకత్వం : కరుణ కుమార్.

    English summary
    Palasa 1978 movie is based on North Andhra back drop. This movie going to be release on March 6th
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X