Bigg Boss Telugu 7 Winner: అమర్‌దీప్‌ కారుపై దాడి చేసింది తన ఫ్యాన్స్ కాదట.. ఎవరో చెప్పి షాకిచ్చిన ప్రశాంత్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఎంత గ్రాండ్ గా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరసం లేదు. అద్భుతమైన డ్యాన్స్ లు, అంతకు మించిన టాస్క్ లు పెడుతూ... విన్నర్, రన్నరప్ లు ఎవరో తేల్చేశారు. ఆ తర్వాత వాళ్లు బయటకు రావడం.. అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద పెద్ద రచ్చ జరగడం కూడా మనకు తెలిసిందే. ముఖ్యంగా అశ్విని శ్రీ బెంజ్ కారు, గీతూ రాయల్ తాను సొంతంగా కొనుక్కున్న కార్లతో పాటు అమర్ దీప్ కారుపై కూడా చాలా వరకు ధ్వంసం అయ్యాయి. కేవలం కంటెస్టెంట్ల కార్లు మాత్రమే కాకుండా తెలంగాణ ఆర్టీసీ బస్సులపై కూడా పలువురు ఆకతాయిలు దాడి చేశారు. ముఖ్యంగా ఈ దాడిపై ఇప్పటికే కేసులు కూడా నమోదు అయ్యాయి.

రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తో పాటుగా ఆయన ఫ్యాన్స్ పై కూడా ఆరు సెక్షన్ల కింద కేసులు పెట్టారు పోలీసులు. మరోవైపు చాలా మంది సెలబ్రిటీలు ఇలా దాడి చేయడం సరికాదంటూ వివరిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ షాకింగ్ కామెంట్లు చేశాడు. ముఖ్యంగా తనపై ఇంత ప్రేమ కనబర్చి గెలిపించినందుకు అందరికీ థాంక్స్ అంటూ చెప్పుకొచ్చాడు. తాను నిజంగైనే రైతు బిడ్డను అని.. కావాలంటే తన ఊరు వచ్చి చెక్ చేసుకోవచ్చని వెల్లడించాడు. మీడియాలో చెబుతున్నట్లుగా తనకు అంతగా ఆస్తిపాస్తులు ఏమీ లేవని స్పష్టం చేశాడు.

Pallavi Prashanth Shocking Comments About His Fans Attack on Amardeep

తనకు కేవలం నాలుగు ఎకరాల భూమి మాత్రమే ఉందని.. అలాగే ఒకే ఒక ట్రాక్టర్ ఉందని వెల్లడించాడు. కానీ 20 ఎకరాలు భూమి ఉంది, నాలుగు ట్రాక్టర్లు ఉన్నాయంటూ వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవం అని పేర్కొన్నారు. అంతేకాకుండా తనకు ఎవరూ ఎలాంటి బహమతులు ఇవ్వలేరని.. కేవలం బిగ్ బాస్ వాళ్లు స్టేజీపై అనౌన్స్ చేసినవి మాత్రమే తనకు వచ్చాయని అంతకు మించి ఏ ఒక్కటి తనకు వచ్చినా ప్రజలే వచ్చి తీసుకెళ్లొచ్చని కామెంట్లు చేశారు. ఆ తర్వాత అమర్ దీప్ కారు, మిగతా కంటెస్టెంట్లపై గ్రాండ్ ఫినాలే రోజు దాడి జరిగిందని.. అది మీకు తెలుసా అని ప్రశ్నించారు.

అందుకు స్పందించిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్.. తెలుసని.. కానీ అంతా అనుకున్నట్లుగా తన ఫ్యాన్స్ మాత్రం ఇలా చేసి ఉండరని అన్నాడు. హౌస్ లో ఉన్నప్పటి నుంచి కావాలని ప్లాన్ చేసుకుని గేమ్ ఆడుతున్నది వాళ్లేనని.. ఇప్పుడు కూడా వాళ్లే కావాలని ఇలా అటాక్ చేయించుకున్నారని చెప్పాడు. తాను కానీ తన అభిమానులు కానీ ఇలాంటి పనులు అస్సలే చేయరని, చేయలేరని మరోసారి స్పష్టం చేశాడు. మీపై కేసులు కూడా పెట్టారు కదా అనగా.. అవును నాకు తెలీకుండా జరిగినదానికి నన్ను ఎలా బాధ్యుడిని చేస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

Pallavi Prashanth Shocking Comments About His Fans Attack on Amardeep

తనకోసం అన్నపూర్ణ స్టూడియోస్ వరకూ వచ్చిన అభిమానులు అందరికీ థాంక్స్ అని.. కానీ వాళ్లతో తాను కలవలేకపోయినందుకు చాలా బాధ పడుతున్నానని అన్నాడు. అయితే తనకోసం ఎవరైనా సరే తన ఊరికి వస్తే వారు కోరినంత సేపు వారితో సమయం గడుపుతానని పల్లవి ప్రశాంత్ వెల్లడించాడు. మరోవైపు అమర్ దీప్ కారుపై దాడి చేసింది ఎవరో పోలీసుల విచారణలోనే తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది. రైతుబిడ్డ అభిమానులే దాడి చేశారా, లేక పల్లవి ప్రశాంత్ చెప్పినట్లు ఆయనకు పాజిటివ్ టాక్ రావాలని ఆయనే అలా దాడి చేయించుకున్నాడా అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X