Kalki 2898 AD Release Date: కల్కి అఫీషియల్ రిలీజ్ డేట్ ఇదే.. ప్రభాస్ సినిమా ఎప్పుడు రాబోతుందంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి, ఆయనకు దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన సినిమాలతో వస్తూ.. బాక్సాఫీసును బద్ధలు చేసే ఈయన.. తాజాగా మరో క్రేజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈసారి కాస్త డిఫరెంట్ ఉండే కథాంశంతో రాబోతున్నారు. ఆ సినిమా పేరే కల్కి 2898 ఏడీ. అయితే గతంలోనే ఈ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేయగా.. దాన్ని మార్చేశారు. ఇప్పుడు అఫీషియల్ రిలీజ్ డేట్ ను కన్ఫార్మ్ చేశారు. అయితే ఈ చిత్రం ఎప్పుడు థియేటర్లలోకి రాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న సినిమానే కల్కి 2898 ఏడీ. అయితే ఈ సినిమా వస్తుందని చెప్పినప్పటి నుంచి అంతా తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీని నుంచి ఎలాంటి చిన్న అప్ డేట్ వచ్చినా తెలుసుకుంటూ రచ్చ చేస్తున్నారు. కల్కి 2898 ఏడీ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించబోతుంది. అలాగే బిగ్ బీ అమితా బచ్చన్, లోకనాయకుడు కనమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, సస్వత ఛటర్జీ, పశుపతి, గౌరవ్ చోప్రా, మండవ సాయి కుమార్ వంటి వాళ్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Pan Idia Star prabhas Kalki 2898 AD Movie Official Release Date Outnow Check Details

ప్రభాస్ సినిమాలు వస్తున్నాయంటే చాలు పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అవుతుంటాయి. కానీ భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతుండగా.. మరింత పెద్ద ఎత్తున అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్ లకు చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్ల కోసమే అన్నట్లుగా చాలా కాలంగా ఈ సినిమా ఆ తేదీన రాబోతుంది, ఈ తేదీన రాబోతుంది అంటా చాలా మంది అంచనాలు వేశారు. ముఖ్యంగా ఎక్కువగా మే 9వ తేదీన సినిమా విడుదల అయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు.

వైజయంతి మూవీస్ కు కలిసి వచ్చిన మే 9వ తేదీన రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు పెద్ద ఎత్తునే వార్తలు వచ్చాయి. ముఖ్యంగా గతంలో మే 9వ తేదీన జగదీకవీరుడు.. అతిలోక సుందరి సినిమాను విడుదల చేయగా బ్లాక్ బస్టర్ హిట్టు అయింది. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు మర్చిపోని సినిమాగా మారింది. అయితే ఈ రోజే ప్రభాస్ కల్కి సినిమాను కూడా విడుదల చేస్తే కలిసి వస్తుందని అనుకున్నారట. కానీ పలు కారణాల వల్ల ఈ తేదీన కాకుండా మరో రోజున ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

Pan Idia Star prabhas Kalki 2898 AD Movie Official Release Date Outnow Check Details

ఈ ఏడాది జూన్ 27వ తేదీన ప్రభాస్ హీరోగా రాబోతున్న కల్కి 2898 ఏడీ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ దాదాపు 600 కోట్ల బారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తుండగా.. 2020లో ఈ సినిమా గురించి తొలిసారి ప్రకటన చేశారు. మూడేళ్లకు సినిమా విడుదలకు మోక్షం కల్గింది. మరి జూన్ 27వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ కొడుతుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X