Kalki 2898 AD Release Date: కల్కి అఫీషియల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రభాస్ సినిమా రాబోయేది ఏ రోజు అంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన చేసే సినిమాలకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో కూడా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా కథలు నచ్చకపోయినా బాక్సాఫీసు వద్ద మాత్రం భారీగానే వసూళ్లు సాగుతుంటాయి. అయితే ఇటీవలే ఆయన హీరోగా వచ్చిన సలార్ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. దుమ్ము లేపుతూ రచ్చ చేస్తోంది. ఇదే ఊపుతో మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు ప్రభాస్. అయితే ఈ సినిమా ఏంటి, ఎప్పుడు రిలీజ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న ప్రాజెక్టు కె.. కల్కి 2898 ఏడీ సినిమా గురించి అందరికీ తెలసిందే. అయితే ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించబోతుంది. అలాగే బిగ్ బీ అమితా బచ్చన్, లోకనాయకుడు కనమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, సస్వత ఛటర్జీ, పశుపతి, గౌరవ్ చోప్రా, మండవ సాయి కుమార్ వంటి వాళ్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ తారాగణంతో రాబోతున్న ఈ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి.

Pan Idia Star prabhas Kalki 2898 AD Movie Release Date Fixed Check Details

ప్రభాస్ హీరోగా వస్తున్నాడంటేనే పెద్ద ఎత్తన అంచనాలు నమోదు అవుతుంటాయి. ఇక స్టార్ నటులు కూడా ఈ సినిమాలో కనిపించనున్నారంటే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ప్రత్యేంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్ లకు చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్ల కోసమే అన్నట్లుగా చాలా కాలంగా ఈ సినిమా ఆ తేదీన రాబోతుంది, ఈ తేదీన రాబోతుంది అంటా చాలా మంది అంచనాలు వేశారు.

ముఖ్యంగా ఎక్కువగా మే 9వ తేదీన సినిమా విడుదల అయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు. అయితే ఈ వార్తలే నిజం అయ్యాయి. చిత్రబృందం కూడా మే 9వ తేదీన సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తుందట. ముఖ్యంగా ఈ సినిమాను వైజయంతి మూవీస్ కు కలిసి వచ్చిన మే 9వ తేదీన రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ముఖ్యంగా గతంలో మే 9వ తేదీన జగదీకవీరుడు.. అతిలోక సుందరి సినిమాను విడుదల చేయగా బ్లాక్ బస్టర్ హిట్టు అయింది. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు మర్చిపోని సినిమాగా మారింది. అయితే ఈ రోజే ప్రభాస్ కల్కి సినిమాను కూడా విడుదల చేస్తే కలిసి వస్తుందని భావిస్తున్నారుట.

Pan Idia Star prabhas Kalki 2898 AD Movie Release Date Fixed Check Details

ఇదంతా ఇలా ఉండగా.. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ దాదాపు 600 కోట్ల బారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే 2020లో ఈ సినిమా గురించి తొలిసారి ప్రకటన చేయగా.. మూడేళ్లకు సినిమా విడుదలకు మోక్షం కల్గింది. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తెగ ఖుషీ అయిపోతున్నారు. మరి మే 9వ తేదీన విడుదల కాబోయే ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టు కొడుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X