మొదటిసారి ఇష్టంగా ఖరీదైన కారును కొనుగోలు చేసిన రాజమౌళి.. ధర ఎంతంటే?

దర్శకధీరుడు రాజమౌళి మొత్తానికి RRR సినిమాతో బాక్సాఫీసు వద్ద మరో బిగ్గెస్ట్ రికార్డును సొంతం చేసుకున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజమౌళి చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు అనే చెప్పాలి. అయితే రాజమౌళి పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది అనే విషయంపై జనాల్లో చాలా ఆసక్తి ఉంటుంది. ఇక దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న రాజమౌళి రియల్ లైఫ్ లో మాత్రం చాలా సింపుల్ గా ఉంటారు. ఇక మొదటి సారి ఆయన ఇష్టంతో ఒక ఖరీదైన కారును కొనుగోలు చేయడం విశేషం.. వివరాల్లోకి వెళితే..

వరుస విజయాలతో..

వరుస విజయాలతో..

శాంతినివాసం సీరియల్ తో దర్శకుడిగా మారిన రాజమౌళి ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమా తీసి చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. ఇక ఆ తర్వాత సింహాద్రి ఛత్రపతి విక్రమార్కుడు యమదొంగ ఇలా వరుస సినిమాలతో ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా మారిపోయాడు. మగధీర సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకున్న రాజమౌళి ఆ తర్వాత బాహుబలి వరకు అదే ఊపును కొనసాగించారు.

RRR తో సెన్సేషనల్ హిట్

RRR తో సెన్సేషనల్ హిట్

ఇక RRR సినిమాతో దేశం మొత్తాన్ని ఆకర్షించిన రాజమౌళి మరొక బిగ్గెస్ట్ పాన్ ఇండియా విజయాన్ని సొంతం చేసుకున్నారు. చాలా కాలం తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా ఇండియా మొత్తంలో RRR ఒక బెస్ట్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా అని చెప్పవచ్చు. మొత్తానికి సినిమా బాక్సాఫీస్ వద్ద 1,100 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ తో సరికొత్త రికార్డ్ను క్రియేట్ చేసింది.

మహేష్ బాబుతో బిగ్ మూవీ

మహేష్ బాబుతో బిగ్ మూవీ

ఇక రాజమౌళి తదుపరి సినిమాను మహేష్ బాబు తో తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే RRR కంటే ఎక్కువ స్థాయిలో తెర పైకి తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆఫ్రికా అడవుల్లో నేపథ్యంలో కథను రూపొందిస్తున్నట్లు సమాచారం.

రాజమౌళి లైఫ్..

రాజమౌళి లైఫ్..

ఇక రాజమౌళి ఇటీవల ఒక ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. సాధారణంగా రాజమౌళి లగ్జరీ లైఫ్ ను ఏమాత్రం ఇష్టపడడు. చాలా సింపుల్ గా ఉండేందుకు ఇష్టపడుతూ ఉంటాడు. ఇప్పటివరకు రాజమౌళి కార్లపై పెద్దగా ఆసక్తి చూపలేదు. తన కుటుంబ సభ్యులే చాలావరకు కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ రాజమౌళి మాత్రం పెద్దగా ఇష్టపడి కార్లను కొనుగోలు చేయలేదట.

 మొదటిసారి ఖరీదైన కారు

మొదటిసారి ఖరీదైన కారు

ఇక మొదటి సారి రాజమౌళి ఒక ఖరీదైన లగ్జరీ కారును ఇష్టపడి సొంతం చేసుకున్నాడు. ఖరీదైన వోల్వో ఎక్స్‌సి40 కారణం రాజమౌళి కొనుగోలు చేసినట్లు ఆ సంస్థ సోషల్ మీడియాలో అధికారికంగా తెలియజేసింది. ఆ కారు ధర 44.50 లక్షలు ఉంటుంది అని సమాచారం.

కారులో ఉండే ప్రత్యేకతలు

కారులో ఉండే ప్రత్యేకతలు

ఫ్యూజన్ రెడ్ కలర్‌లో ఉన్న ఈ కారును ఆ సంస్థ ఇండియా ప్రతినిధి డెలివరీ చేయడం జరిగింది. కారులో ఉన్న ప్రత్యేకతల విషయానికి వస్తే.. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ లాంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. రాజమౌళి ఈ కారును చాలా ఇష్టపడి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X