పాన్ ఇండియా స్టార్ ఆధార్ కార్డ్ వైరల్.. ఆ యంగ్ హీరో కరెక్టు వయసెంతో చూసేయండి!
స్టార్ హీరోలు, సెలబ్రిటీలకు సంబంధించిన ఎలాంటి వార్తలు అయినా సరే త్వరగా వైరల్ అయిపోతుంటాయి. ముఖ్యంగా వారేం చేసిన ట్రెండింగ్ గా మారుతుంటాయి. వారికి సంబంధించి బట్టలు, ఆస్తులు, కార్లు.. ఇలా ప్రతీ దాన్ని బూతద్దంలో పెట్టి చూస్తుంటారు నెటిజెన్లు. ఇఖ వారికి సంబంధించి చిన్నప్పటి ఫొటోలు వంటివి దొరికితే అయితే పండగే. అయితే తాజాగా నెట్టింట పాన్ ఇండియా స్టార్ ఆధార్ కార్డ్ వైరల్ గా మారింది. ఆయనకు సంబంధించిన పూర్తి వివరలాతో కూడిన ఆధార్ కార్డు సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతోంది. ఆయన ఎవరు, ఆ ఆధార్ కార్డులో ఏం ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈశ్వర్ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈయన.. తన మొదటి సినిమాతోనే తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత తీసిన వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్, మిర్చి, బాహుబలి వంటి చిత్రాల్లో నటించి తెలుగు సినిమా రేంజ్ ను కూడా పెంచేశాడు. 43 ఏళ్ల వయసు ఉన్న ఈయన ఏం చేసినా మరింతగా ట్రెండ్ అవుతుంటుంది. అయితే తాజాగా ప్రభాస్ కు చెందిన ఆధార్ కార్డ్ నెట్టింట వైరల్ గా మారింది.

ప్రభాస్ కు సంబంధించి.. నెట్టింట వైరల్ అవుతున్న ఆధార్ కార్డులో.. ఆయన ఫొటో అంది ఫొటోల్లాగే అంద విహీనంగా ఉంది. ముఖ్యంగా ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ అని ఆయన పూర్తి పేరును అందులో మెన్షన్ చేశారు. అలాగే ఆయన 1979వ సంవత్సరం 10వ నెల 23వ తేదీన పుట్టినట్లుగా అందులో కనిపిస్తోంది. అలాగే ప్రభాస్ ఆధార్ కార్డు నెంబర్ 5986 6623 9932గా ఉంది. ఈ ఆధార్ కార్డు చూస్తున్న అభిమానులు మరింత వైరల్ చేస్తున్నారు.
తమ అభిమాన హీరో ఆధార్ కార్డు దొరికే సరికి తెగ సంబర పడిపోతున్నారు. తమకు తెలిసిన వాళ్లకు కూడా షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంది ఈ ఆధార్ కార్డును పోస్టులుగా పెడుతూ నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ ఆధార్ కార్డును మీరు కూడా చూసి ఉండకపోతే ఇప్పుడే చూసేయండి.

ఇదంతా ఇలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్.. అద్భుతమైన చిత్రాల్లో నటిస్తున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి సలార్ చిత్రంలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదల అయింది. అదిరిపోయే యాక్షన్ సీన్లతో పాటు అంతకు మించిన ఎమోషన్స్ ను చూపించారు ఇందులో. మరి డిసెంబర్ 22వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో వసూళ్లు రాబడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











