Prabhas Maruti Film: ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ లీక్.. లుంగీలో కత్తులతో.. ఇది కదా అసలైన సంక్రాంతి ట్రీట్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈయన హీరోగా వచ్చిన తాజా చిత్ర సలార్.. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో బాక్సాఫీసులను షేక్ చేస్తున్న ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. అయితే ఇదే ఊపులో ప్రభాస్ మరో సినిమా చేయబోతున్నాడు. అయితే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఈయన హీరోగా కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, పోస్టర్ రిలీజ్ డేట్ ను చిత్రబృందం ఫిక్స్ చేసింది. కానీ అంతలోనే ఈ వివరాలు లీక్ అయ్యాయి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా రాబోతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మిస్తున్నారు. అయితే ఫుల్ లెంత్ కామెడీగా తెరకెక్కబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను అలాగే టైటిల్ ను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నారు తాజాగా ప్రకటించారు. జనవరి 15వ తేదీ రోజు ఉదయం 7 గంటల 8 నిమిషాలకు ఈ సినిమా పోస్టర్ ను ఫస్ట్ లుక్ ను విడుత చేయబోతున్నట్లు చెప్పారు. అలా చెప్పిన కాసేపటికే ఈ సినిమా పోస్టర్ లీక్ అయింది. అలాగే టైటిల్ కూడా ఖరారు అయిందని.. దాని పేర్లు కూడా చెబుతున్నారు. అయితే టైటిల్ పై క్లారికీ లేకపోయినా రెండు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రభాస్, మారుతి కాంబోలో రాబోతున్న ఈ సినిమా పోస్టర్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ వైరల్ అవతుంది. అయితే అందులో ప్రభాస్ వైట్ కలర్ లుంగీ.. బ్లాక్ కలర్ షర్టులో కనిపిస్తున్నారు. చాలా కోపంగా చూస్తూ రెండు చేతుల్లో రెండు కత్తులు పట్టుకుని మాస్ గా కనిపిస్తున్నారు. అయితే ఏదో ఫంక్షన్ జరుగుతుండగా.. విలన్లు దాడి చేసినట్లు ఈక్రమంలోనే ఫైట్ జరుగుతున్నట్లు ఈ ఫొటో చూస్తుంటే అర్థం అవుతుంది. అయితే ముందుగానే ఈ పోస్టర్ బయటకు రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
మరికొందరు అయితే ఈ పోస్టర్ మిర్చి సినిమాది అని.. చాలా బాగ్ పేక్ ఎడిటింగ్ చేశారని.. ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్ టైనర్ లో ఇలా కత్తులు పట్టుకుని ఎందుకు కనిపిస్తాడంటూ మరికొంత మంది నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. ఇది ఫేక్ పోస్టర్ అని చెప్పుకొస్తున్నారు. అలాగే ఈ సినిమాకు రాజాసాబ్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు కొందరు చెబుతుండగా.. రాజా డీలక్స్ అనే టైటిల్ ను ఫైనల్ చేసినట్లు మరికొంత మంది చెబుతున్నారు. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ జనవరి 15వ తేదీన మాత్రం వీటన్నిటిపై కచ్చితంగా క్లారిటీ వస్తుంది.
ప్రభాస్ హీరోగా చేయబోతున్న ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నట్లు టాక్ నడుస్తోంది. అందులో ఒకరు నిధి అగర్వాల్ కాగా, మరొకరు మాళవిక మోహనన్ అని, మరొకరు రిద్ధి కుమార్ అని సమాచారం. చాలా రోజుల తర్వాత ప్రభాస్ మరోసారి కామెడీ చేయబోతుండగా.. ఈ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. బాహుబలి తర్వాత నుంచి అలాంటి క్యారెక్టర్ లో ప్రభాస్ కనిపించలేదు. మరి ఈసారి అయినా అలాంటి పాత్రలో నటించి ప్రభాస్ మెస్మరైజ్ చేస్తాడా లేదా అనేది చూడాలి.



Click it and Unblock the Notifications











