Prabhas : షూటింగ్‌లో ప్రమాదం.. ప్రభాస్‌కు గాయాలు, కల్కి పరిస్ధితి ఏంటీ?
ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్‌లలో ఎవరైనా బిజీ నటుడు ఉన్నారంటే అది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి. ఈ ఏడాది కల్కి 2898 ఏడీతో మరోసారి రూ.1000 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన ఆయన చేతి నిండా సినిమాలతో ఇండియాలో ఏ హీరో లేనంత బిజీగా ఉన్నారు. ది రాజా సాబ్, సలార్ 2, కల్కి 2, స్పిరిట్, హనురాఘవపూడి సినిమాలతో పాటు మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పనిలో ఆయన ఉన్నారు. అంతేకాదు డార్లింగ్ చేతిలో ఉన్న సినిమాలన్నీ పాన్ ఇండియా చిత్రాలే కావడం విశేషం.
ఇదిలాఉండగా.. ప్రభాస్ మరో క్రేజీ డైరెక్టర్‌తో ఓ కొత్త సినిమాకు కమిటైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయనెవరో కాదు హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీని ఈయనే తెరకెక్కిస్తున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా ఆగినట్లుగా చిత్ర పరిశ్రమలో వార్తలు వస్తున్నాయి. ఈ గ్యాప్‌లో ప్రశాంత్ వర్మ.. మరో సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. అదే ప్రభాస్‌తోనే అని ఫిలింనగర్ టాక్.

ఇప్పటికే ప్రభాస్‌కి ఆయన వినిపించిన స్టోరీ లైన్ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌ని త్వరలోనే అనౌన్స్ చేయాలని ప్రశాంత్ వర్మ పట్టుదలతో ఉన్నారట. సంక్రాంతికి ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఇచ్చేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇకపోతే.. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ది రాజా సాబ్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న రాజా సాబ్ థియేటర్‌లలో అడుగుపెట్టనున్నాడు. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారట.

ఇలా మంచి జోష్‌లో ప్రభాస్ ఉన్న వేళ ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఓ సినిమా షూటింగ్‌లో డార్లింగ్ గాయపడటంతో ఆయన వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా తెలియజేశారు. అంతేకాదు.. కల్కి 2898 ఏడీ జపాన్‌లో రిలీజ్ కానుండగా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నానని డార్లింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తనను క్షమించాలని ప్రభాస్ ఓ పోస్ట్ పెట్టారు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. ఆయన కోలుకునే వరకు షూటింగ్స్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా.. కల్కి 2898 ఏడీ జనవరి 3న జపాన్ వ్యాప్తంగా భారీగా రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











