Kalki 2898 AD: ప్రభాస్ కొత్త సినిమా క్రేజీ అప్‌డేట్.. షూటింగ్ జరిగేది అక్కడే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న తర్వాతి సినిమా కల్కి 2898 ఏడీ గురించి అందరికీ తెలిసిందే. ప్రభాస్ తో పాటు ఆయనకు సినిమాలకు ఉన్న క్రేజ్ రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. అయితే ఇటీవలే వచ్చిన సలార్ సినిమా సూపర్ డూపర్ హిట్టు కావడంతో నెక్స్ట్ సినిమాపై మరిన్ని అంచనాలు నమోదు అయ్యాయి. అయితే ఈ సినినిమా నుంచి తాజాగా ఓ క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. సినిమా షూటింగ్ షెడ్యూల్ ఈరోజే ప్రారంభం కాగా.. ఎక్కడ జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న కల్కి 2898 ఏడీ సినిమా గురించి, అందులో నటించబోయే నటీనటులు అందరి గురించి ఇప్పటికే ప్రకటించారు. ముఖ్యంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించబోతుంది. అలాగే బిగ్ బీ అమితా బచ్చన్, లోకనాయకుడు కనమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, సస్వత ఛటర్జీ, పశుపతి, గౌరవ్ చోప్రా, మండవ సాయి కుమార్ వంటి వాళ్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

భారీ తారాగణంతో రాబోతున్న ఈ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు నమోదు కాగా... ఇప్పటికే విడుదల అయిన పోస్టర్ లను చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్ల కోసమే అన్నట్లుగా ఈ సినిమా చిత్రబృందం నుంచి అదిరిపోయే అప్ డేట్ ను బయటకు వచ్చింది. అది మరోదే కాదు.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఎక్కడ జరుగుతుందో... తెలిసిపోయింది.
కల్కి 2898 ఏడీ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈరోజే ఈ సినిమాలో ప్రధాన నటీనటులు ఈ షెడ్యూల్ లో పాల్గొన్న్టలు తెలుస్తోంది. అయితే ప్రభాస్ ఏదో ఆరోగ్య సమస్యతో బాధ పడుతుండడం.. ఆయన ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో.. మిగతా వాళ్లకు సంబంధించిన షూటింగ్ జరుగుతోందట. ప్రభాస్ లేకుండా తెరకెక్కించాల్సిన చాలా సిన్నివేషాలను పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ దాదాపు 600 కోట్ల బారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే 2020లో ఈ సినిమా గురించి తొలిసారి ప్రకటన చేయగా.. మూడేళ్లకు సినిమా విడుదలకు మోక్షం కల్గింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను మే 9వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేస్తుందట. తంలో మే 9వ తేదీన జగదీకవీరుడు.. అతిలోక సుందరి, మహానటి, మహర్షి వంటి సినిమాలు విడదలై బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవగా.. అదే రోజు ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











