Dunki Movie: డంకీ సినిమాకు భారీ నష్టం కల్గించిన ప్రభాస్.. తీవ్ర నిరాశలో షారుఖ్ ఫ్యాన్స్
అద్భుతమైన కథలు, విభిన్నమైన పాత్రలతో ఎప్పుడూ సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు వచ్చే బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా హీరోగా కొనసాగుతున్న షారుఖ్ ఖాన్.. వరుస ఫ్లాప్ లతో తెగ ఇబ్బంది పడిపోయాడు. కానీ ఈ మధ్య ఆయన నుంచి వచ్చిన ప్రతీ చిత్రం హిట్టు అవుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో బాక్సాఫీసు వద్ద వసూళ్లు సొంతం చేసుకుంటూ తెగ సందడి చేస్తున్న ఆయన... తాజాగా డంకీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ చిత్రానికి మాత్రం ఆశించిన స్థాయిలో రెప్సాన్స్ రావడం లేదు. అందుకు కారణం ఒక్కటేనని అంతా అనుకుంటున్నారు. అదేంటో మనం ఈ కథలో చూసేద్దాం.
డంకీ సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ కథ పరంగా సాటిస్ పై అవుతున్నారు. ఇంకా కొంచెం బాగుండొచ్చు అని అంటున్నారే తప్పు పెద్దగా చెప్పేందుకు ఈ సినిమాలో ఎలాంటి తప్పులూ కనిపించడం లేదు. ముఖ్యంగా రెండు బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రాల తర్వాత షారుఖ్ హీరోగా రాబోయే చిత్రంపై పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి. అయితే ఈ అంచనాలను అందుకోలేకపోవడం కూడా ఈ చిత్రానికి మైనస్ గా మారింది. అలా అని ఈ సినిమా ఏం మరీ దారుణంగానూ లేదు. కాస్త ఫర్వాలేదనిపిస్తున్న ఈ సినిమా హిట్టుగా నిలవకపోవడానికి ప్రధాన కారణం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అని అంతా అంటున్నారు.

ముఖ్యంగా అందరు మెచ్చే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా చాలా మైనస్ అయిందని చెప్పుకొస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఒక్కరోజు తేడాతోనే విడుదల అవ్వడం వల్లే షారుక్ ఖాన్ డంకీ సినిమా ఆడట్లేదని అంతా అనుకుంటున్నారు. ఈ సినిమా ఇప్పుడు కనుక విడుదల కాకపోయి ఉంటే కచ్చితంగా డంకీ హిట్టుగా నిలిచేదని కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ మాస్ యాక్షన్ ముందు.. షారుఖ్ చేసే కామెడీని ఎవరూ చూసేందుకు ఇష్ట పడడం లేదని.. ముఖ్యంగా గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్న యాక్షన్ సీన్లు సలార్ లో ఉన్నాయని అంతా వివరిస్తున్నారు.
మూడ్రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా డంకీ అన్ని ఏరియాలనూ కలుపుకుని కేవలం రూ. 75.32 కోట్లు నెట్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. అలాగే, రూ. 135 కోట్లు గ్రాస్‌ను రాబ్టటింది. సలార్ సినిమాతో పోటీగా రావడం వల్లే డంకీకి ఇంత గడ్డు కాలం ఏర్పడిందని చాలా మంది సినీ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. వేర్వేరు సమయాల్లో విడుదల అయి ఉంటే మాత్రం డంకీ కచ్చితంగా బాక్సాఫీసు వద్ద బాగానే వసూళ్లు రాబట్టుకుని హిట్టుగా నిలిచేదని చాలా మంది భావిస్తున్నారు. ఎలాంటి పెద్ద సినిమాలు లేని సమయంలో వచ్చి ఉంటే స్టార్ హీరో చిత్రం కాబట్టి అంతా చూసి ఉండేవారని మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభాస్ సలార్ సినిమా.. షారుఖ్ ఖాన్ డంకీకీ గట్టి దెబ్బనే కొట్టింది.


Click it and Unblock the Notifications











