బాహుబలి నిర్మాతలతో ప్రభాస్ కొత్త సినిమా.. ఊహించని పాత్రతో రాజమౌళి మూవీకి మించి!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఈశ్వర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన ఆయనపై అభిమానులకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడంలేదు.
ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఈ సినిమాను నిర్మించిన ఆర్కా మీడియాతో ఇప్పటివరకు మళ్లీ సినిమా చేయలేదు డార్లింగ్. అయితే త్వరలో మళ్లీ బాహుబలి నిర్మాతలతో ఓ సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

యంగ్ రెబల్ స్టార్ గా: స్టార్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తనదైన క్రేజ్ క్రియేట్ చేసుకున్నాడు డార్లింగ్ ప్రభాస్. అతి తక్కువ సమయంలో టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగాడు. ఈశ్వర్ తో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ అప్పటి వరకు యంగ్ రెబల్ స్టార్ గా క్రేజ్ అందుకున్నాడు. ఇక టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు.
ఊహించిన స్థాయిలో: బాహబలి రెండు పార్ట్స్ సినిమాల బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నుంచి అన్ని సినిమాలను భారీగానే ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు ప్రభాస్. ఈ క్రమంలోనే సుజిత్ దర్శకత్వంలో సాహో, రాధా క్రిష్ణ కుమార్ డైరెక్షన్ లో రాధేశ్యామ్ సినిమాల్లో నటించాడు ప్రభాస్. అయితే అవి ఊహించినంత స్థాయిలో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ నిరుత్సాహపడ్డారు.

ఆరు సినిమాలతో: ప్రస్తుతం ప్రభాస్ సినిమా కోసం అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదిపురుష్ సినిమా టీజర్ ను వదలగా దానిపై తెగ ట్రోలింగ్ జరిగింది. ఇక ఇటీవల విడుదల చేసిన జై శ్రీరామ్ లిరికల్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అప్పటివరకు ఆదిపురుష్ పై ఉన్న నెగెటివిటీ తొలిగిపోతుందనే అర్థమవుతోంది. కాగా ప్రభాస్ ఆదిపురుష్ తో పాటు మరో ఐదు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే.
మైత్రీ నిర్మాతలతో: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న 'ప్రాజెక్ట్ K', సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' మారుతితో హారర్ కామెడీ చిత్రంగా 'రాజా డీలక్స్' (ప్రచారంలో ఉన్న టైటిల్) ఉన్నాయి. అలాగే పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత యెర్నేని నవీన్ అన్ స్టాపబుల్ షో తెలిపారు.

కథ ఫైనలైజ్: ఇలా ఐదారు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ బాహుబలి నిర్మాతలతో మళ్లీ మూవీ చేయలేదు. అయితే ఇప్పుడు అర్కా మీడియా వర్క్స్ పతాకంపై ప్రభాస్ నటిస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. బాహుబలి నిర్మాతలైన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనితో ఓ సినిమా విషయమై చర్చలు చేస్తూ వచ్చారట. ఇప్పటికీ ఓ కథను ఫైనలైజ్ చేశారని ప్రస్తుతం టాక్.

బాహుబలి కంటే: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనితో సినిమా చేసేందుకు డార్లింగ్ ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని సమాచారం. ఇక ఈ మూవీ కథలో హీరో క్యారెక్టర్ ఇప్పటివరకు ప్రభాస్ చేసిన ఏ పాత్రతో పోల్చి చూసినా సరే సంబంధం ఉండదట. కొత్త తరహా పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని.. బాహుబలి కంటే ఇంది డిఫరెంట్ మూవీ అని ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న టాక్.


Click it and Unblock the Notifications











