Radhe shyam Trailer: విధిని ఎదిరింది ప్రేమ గెలవగలదా.. రొమాన్స్, మిస్టరీతో విజువల్ వండర్

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ ప్రదేశం సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే కేవలం తెలుగులోనే కాకుండా హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమాని విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. మొత్తానికి ఈ సినిమా మరోసారి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రభాస్ చాలా విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు తెలుస్తోంది.

నా జీవితంలో ప్రేమ లేదు..

నా జీవితంలో ప్రేమ లేదు..

ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో ఒక పామిస్ట్ గా కనిపించబోతున్నాడు. ఇక పూజ అయితే సరదాగా తిరిగే ఒక బ్యూటిఫుల్ ప్రేరణగా కనిపించబోతోంది. సినిమా ట్రైలర్ లో ప్రతి అంశం కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. మొదట నా జీవితంలో ప్రేమ అనే అంశం లేదు అని అనుకున్నా హీరో ఆ తరువాత అతనికి నచ్చిన అమ్మాయి తో ఎలాంటి జీవితం కొనసాగించాడు అనేది సినిమాలో ప్రధానమైన అంశం.

 కృష్ణం రాజు స్పెషల్ రోల్

కృష్ణం రాజు స్పెషల్ రోల్

పూజా హెగ్డే సినిమాలో ఓవైపు రొమాంటిక్ గా కనిపిస్తూనే మరోవైపు ప్రభాస్ తో చాలా అల్లరిగా గా దర్శనమిస్తోంది. ఇక ప్రభాస్ కూడా హస్త సాముద్రిక నిపునిడిగా ప్రపంచాన్ని చదివేసిన వ్యక్తి గా కనిపించబోతున్నాడు. రాధేశ్యామ్ సినిమాలో కృష్ణం రాజు ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఆధ్యాత్మిక గురువుగా ఆయన చేసిన పాత్ర కూడా సినిమాలో చాలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలబడి ఉండటం

 విజువల్ వండర్ గా..

విజువల్ వండర్ గా..

ప్రభాస్ ఈ సినిమాలో చెప్పే డైలాగ్స్ కూడా ఎంతో ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. అతని ప్రేమ కాలంతో పోటీ పెడితే ఎలా ఉంటుంది అనే అంశాన్ని దర్శకుడు రాధాకృష్ణ చాలా అందంగా ప్రజెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక సినిమాలో ఒక పెద్ద షిప్ తుఫాను మధ్యలో మునిగిపోయే సన్నివేశాలు కూడా చాలా హైలెట్ గా ఉన్నాయి. చూస్తుంటే ఈ సినిమాలో ఒక విజువల్ వండర్ గా ఉండబోతోందని తెలుస్తోంది.

విధిని ఎదిరించి ప్రేమ గెలవగలదా..

విధిని ఎదిరించి ప్రేమ గెలవగలదా..

ఒకవైపు ప్రేమ మరో వైపు కాలంతో యుద్ధం.. అలాగే ఒక మిస్టరీ ఇలా అన్ని తరహాల అంశాలను హైలెట్ చేసిన దర్శకుడు వెండితెరపై విజువల్ వండర్ ని క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది అని మరోసారి నిరూపించారు. ఇక సినిమాలో డైలాగ్స్ కూడా ఎంతో ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. విధిని ఎదిరించి ప్రేమ గెలవగలదా అనే అంశం తోనే ఈ సినిమా కథ మొత్తం అర్థమవుతోంది.

ట్రైలర్ తో రుజువైంది..

ట్రైలర్ తో రుజువైంది..

ఇక సినిమాలో పూజ పాత్ర చనిపోతుంది అనే అంశాన్ని కూడా హైలెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక హీరో తన జ్ఞాన సంపదలతో కాలాన్ని ఎదిరింది తన ప్రేమను ఎలా సాధించుకుంటాడు అనేది కూడా ఆలోచింపజేసే విధంగా ఉంది. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుంది అని ట్రైలర్ రుజువు చేసింది. ఇక సినిమా జనవరి 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. మరి బాక్సాఫీస్ వద్ద రాధేశ్యామ్ ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X