దసరా సినిమాకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రివ్యూ.. సినిమా అలా ఉందంటూ స్పెషల్ కామెంట్
యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ ఇటీవలే సోషల్ మీడియా ద్వారా.. న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరా సినిమాపై రీవ్యూ రాశారు. ఇన్ స్టాగ్రామ్ వేధికగా సినిమా చాలా బాగుందంటూ ఓ పోస్ట్ పెట్టాడు. సినిమాలో హీరోగా నటించిన నానితో పాటు సినిమాను ప్రశంసించాడు. అలాగే సినిమా కోసం పని చేసిన దర్శక,నిర్మాతలతో పాటు సినీ నటులపై కూడా తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు.
దసరా సినిమాను ఇప్పుడే చాశాను.. ఏం సినిమా.. నాకు చాలా బాగా నచ్చిందని వివరించాడు. ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నట్లు ప్రభాస్ తెలియకేయడంతో సినిమాపై మరింత బజ్ పెరిగింది. అయితే ప్రభాస్ చేసిన ఈ పోస్ట్ పై నెటిజెన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఓ స్టార్ హీరో మరో నటుడి సినిమా చూసి.. ఇంత త్వరగా రివ్యూ ఇవ్వడం చాలా గ్రేట్ అంటూ చెబుతున్నారు. ముఖ్యంగా నాని ఫ్యాన్స్ అయితే ప్రభాస్ రీవ్యూతో ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఈ సినిమాపై ప్రభాస్ రివ్యూ అభిమానుల్లో ఉత్కంఠను రేకెత్తించడంతో పాటు సినిమాకు మంచి పాజిటివ్ పబ్లిసిటీని కూడా తీసుకు వచ్చింది. దసరా చిత్రం బాగుందని డార్లింగ్ ప్రభాస్ చెప్పడంతో.. ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు కూడా థియేటర్ కు వెళ్లి సినిమా చూసే స్కోప్ ఉందని అంతా అనుకుంటున్నారు. ఇంతకు ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ చిత్రంపై సానుకూలంగా స్పందించారు. సినిమా చాలా బాగుందంటూ మిల్క్ బాయ్ మహేశ్ చెప్పడంతో.. నాని ఫ్యాన్స్ తెగ థ్రిల్ అయిపోయారు.
దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల అయిన ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. పక్కా మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం... బాక్సాఫీసును షేక్ చేస్తోంది. విపరీతమైన కలెక్షన్లు సాధిస్తూ.. దూసుకెళ్తోంది. కేవలం ఇండియాలోనే కాకుండా అమెరికాలో కూడా దుమ్ములేపుతోంది. ఇక నాని కెరీర్ మొత్తంలోనే అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా కూడా దసరా రికార్డ్ క్రియేట్ చేసింది.


Click it and Unblock the Notifications











