Kalki 2898 AD నుంచి అదిరిపోయే అప్‌డేట్.. స్పెషల్ సాంగ్ కోసం ఆమెతో ప్రభాస్ రొమాన్స్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా కల్కి 2898 ఏడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి అప్ డేట్ వస్తుందా అని అంతా తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజ్ అప్ డేట్ బయటకు వచ్చింది. ముఖ్యంగా ప్రభాస్ ఓ స్పెషల్ సాంగ్ కోసం ఆ హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్నారట. పూర్తి వివరాలు ఈ కథనంలో ఉన్నాయి చూసేయండి.

డార్లింగ్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న కల్కి 2898 ఏడీ సినిమాలో పెద్ద పెద్ద స్టార్ నటీనటులు కనిపించబోతున్నారు. ముఖ్యంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించబోతుంది. అలాగే బిగ్ బీ అమితా బచ్చన్, లోకనాయకుడు కనమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, సస్వత ఛటర్జీ, పశుపతి, గౌరవ్ చోప్రా, మండవ సాయి కుమార్, దిశా పటాని వంటి వాళ్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

 Pan India Star Prabhas Romantic Duet Shooting Started For Kalki 2898 AD Movie Check Details

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ దాదాపు 600 కోట్ల బారీ బడ్జెట్ తో.. భారీ తారాగణంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పెద్ద పెద్ద నటీనటులు, భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నమోదు కాగా... సినిమా అప్ డేట్లు తెలుసుకోవడానికి ప్రేక్షకులు అంతా తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విషయాలు బయటకు వస్తాయా అని ఆసక్తిగా చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ సూపర్ అప్ డేట్ బయటకు వచ్చింది.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన మరో షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం అయిందని... అలాగే ఈ చిత్రానికి సంబంధించిన ఓ రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ ను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ కోసం ప్రభాస్.. దిశా పటానితో రొమాన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. తమ అభిమాన హీరోను మరోసారి రొమాంటిక్ యాంగిల్ లో చూడొచ్చని అనుకుంటున్నారు.

 Pan India Star Prabhas Romantic Duet Shooting Started For Kalki 2898 AD Movie Check Details

ఇదంతా ఇలా ఉండగా.. ఈ సినిమా విడుదల తేదీన ఇప్పటికే ఫిక్స్ చేశారు. జగదీకవీరుడు, అతిలోక సుందరి, మహానటి, మహర్షి వంటి సినిమాలు విడదలై బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవగా.. అదే రోజు ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ కొడుతుందనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X