Salaar Movie: హాలీవుడ్ రేంజ్ లో సలార్ యాక్షన్ సీన్లు.. ఏకంగా 750 రకాలతో,,!

కేజీఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2లను తెరకెక్కించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో తాజాగా రాబోతున్న చిత్రం సలార్. ఈ సినిమా గురించి ఎలాంటి చిన్న విషయం వచ్చినా నెట్టింట ఫుల్ వైరల్ గా మారుతోంది. అయితే దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో హోంబలే ఫిలిం బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను రెండు పార్టులుగా తీసుకు వస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తోంది.

సలార్ సినిమా ఇప్పటికే సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయాల్సి ఉండగా.. చిత్రబృందం పోస్ట్ పోన్ చేసింది. ముఖ్యంగా ఈసినిమాను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 22వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. క్రిస్మస్ వేదికగా రాబోతున్న ఈ చిత్రంలో భారీ ఎత్తున యాక్షన్ సీన్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను ఢీకొట్టేందుకు మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా చేయబోతున్నారు.

Pan India Star Prabhas Salaar Movie Crew Has Brought 750 Vehicles For a Huge Action Scene.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్లు సీన్లు ఉండబోతుండగా.. ఒక సీన్ కోసం ఏకంగా 750 రకాల వాహనాలను చిత్రబృందం రంగంలోకి దించిందట. కార్లు, జీపులు, ట్యాంకర్లు, ట్రక్కులు, బైక్ లు, స్కూటీలు.. ఇలా 750కి పైగా విభిన్న వాహనాలను సేకరించారట. అలాగే ఎక్కువ శాతం గ్రౌండ్ పైనే యాక్షన్ సీక్వెన్స్ లు డిజైన్ చేయడంతో భారీ వాహనాలను ఉపయోగించారట.

Pan India Star Prabhas Salaar Movie Crew Has Brought 750 Vehicles For a Huge Action Scene.

ఒక్క యాక్షన్ సీన్ లోనే ఇన్న చూపిస్తే సినిమా మొత్తం ఏ రేంజ్ లో ఉంటుందోనని ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. ముఖ్యంగా భారీ మొత్తంలో వాహనాలను ఉపయోగించి యుద్ధ సన్నివేషాలను డిజైన్ చేయడం కేవంల హాలీవుడ్ సినిమాలకు మాత్రమే సాధ్యం అవుతుంది. అలాంటి ప్రభాస్ చిత్రంలోనూ ఈ స్థాయి యాక్షన్ సీన్లు ఉండబోతున్నాయని తెలిసి అంతా ఎగ్జైట్ అవుతున్నారు.

Pan India Star Prabhas Salaar Movie Crew Has Brought 750 Vehicles For a Huge Action Scene.

సలార్ సినిమా కచ్చితంగా సూపర్ డూపర్ హిట్టు అవుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా బాహుబలి తర్వాత ప్రభాస్ చిత్రాలన్నీ డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి. సాహో, రాధే శ్యాం, ఆది పురుష్.. ఇలా అన్ని చిత్రాలు అట్టర్ ఫ్లాపులుగా నిలిచాయి. అయితే భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టు కావాలని అంతా కోరుకుంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టు కొడుతుందనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X