ఆ ఫంక్షన్‌తో మళ్లీ వెలుగులోకి.. వార్తల్లో నిలిచిన ఒకప్పటి హీరో.. సోషల్ మీడియాలో వైరల్ పిక్స్
'పెళ్లి', 'మనసిచ్చి చూడు', 'చాలా బాగుంది', 'నా హృదయంలో నిదురించే చెలి', మా బాలాజీ వంటి పలు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ప్రముఖ హీరో వడ్డే నవీన్. ఒకప్పటి హ్యాండ్స్‌మ్ హీరో అయిన నవీన్‌కు లేడీ ఫాలోయింగ్ చాలా గట్టిగానే ఉండేది. అయితే రాను రానూ సినిమా సక్సెస్ రేటు లేకపోవడంతో కనుమరుగయ్యాడు.

కలిసి రాని సెకండ్ ఇన్నింగ్స్..
సెకండ్ ఇన్నింగ్స్‌లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘అటాక్' సినిమాలో కనిపించాడు. అయితే ఈ చిత్రం కూడా ఏమంతగా ఉపయోగపడలేదు. దీంతో సినిమాలు పక్కన పెట్టేసి సొంత వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నాడు.

తాజాగా వెలుగులోకి..
ఇన్నాళ్లూ వెలుగులోకి రాని వడ్డే నవీన్.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. అసలు ఉన్నాడా? లేడా? అనే ప్రశ్నలకు సమాధానంగా బయటకు వచ్చిన ఈ ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలకు వచ్చే రెస్పాన్స్ చూస్తుంటే వడ్డే నవీన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది.

కుమారుడి పంచెకట్టు వేడుక..
వడ్డే నవీన్ కుమారుడు జిష్ణుకు ధోతీ ఫంక్షన్ చేశారు. ఈ పంచెకట్టు వేడుకలో సినీ తారలందరూ మెరిసారు. ఒకప్పటి నవీన్ హీరోయిన్ రాశీ నుంచి మొదలుకుని ఎంతో మంది ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.

మెగాస్టార్ చిరు హాజరు..
ఈ వేడుకలో చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. సతీమణి సురేఖతో కలిసి వడ్డే నవీన్ ఇంటి వేడుకకు విచ్చేశాడు. ఈ వేడుకలో.. కళాబంధు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి, ప్రముఖ నిర్మాత, నటులు మురళీమోహన్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, సునీల్, వేణు తొట్టెంపూడి, శ్రీకాంత్ ఆయన సతీమణి ఊహా, రోజా, శివాజీ రాజా, నిర్మాత సి.కళ్యాణ్, రాశి, హేమ, శివ బాలాజీ ఆయన సతీమణి మధులత తదితరులు మెరిశారు.


Click it and Unblock the Notifications











