నేనింకా ఆడుకోవడం మొదలుపెట్టలేదు.. అడ్డుకోవడమే మొదలుపెట్టాను.. పందెంకోడి2!
2005 లో వచ్చిన పందెంకోడి చిత్రం విశాల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 13 ఏళ్ల తరువాత ఆ చిత్రానికి సీక్వెల్ పందెంకోడి 2 వస్తోంది. తాజగా ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు. పందెంకోడి చిత్రం ముగిసిన చోటి నుంచే పందెంకోడి2 ప్రారంభించనున్నారు. మొదటి భాగానికి తగ్గకుండా ఇందులో యాక్షన్ సీన్స్ డిజైన్ చేశారు.
టీజర్ లో విశాల్ పవర్ ఫుల్ డైలాగ్స్ తో అదరగొడుతున్నాడు. నేనింకా ఆడుకోవడం మొదలుపెట్టలేదు.. అడ్డుకోవడమే మొదలుపెట్టాను అంటూ మాస్ డైలాగ్స్ వదులుతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది. కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తోంది.

మాస్ చిత్రాల దర్శకుడు లింగుస్వామి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు తమిళ ద్విభాషా చిత్రంగా దీనిని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల అభిమన్యుడు రూపంలో విభిన్నకథా చిత్రంతో హిట్ అందుకున్న విశాల్ ఈ సారి పూర్తి మాస్ చిత్రంతో రాబోతున్నాడు.


Click it and Unblock the Notifications











