విశాల్ ‘పందెం కోడి-2’ సినిమా ట్రైలర్, రిలీజ్ డేట్ ఫిక్స్
తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పరుచుకున్న తమిళ హీరోల్లో విశాల్ ఒకరు. అతడు నటించిన 'పందెం కోడి' తెలుగునాట భారీ విజయం అందుకోవడంతో పాటు టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పరచుకున్నాడు. దాదాపు పదమూడేళ్ల గ్యాప్ తర్వాత 'పందెం కోడి' చిత్రానికి సీక్వెల్ వస్తుండటంతో విశాల్ అభిమానుల్లో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఠాగూర్ మధు విడుదల చేస్తున్నారు. ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న 'పందెం కోడి 2' అక్టోబర్ 18న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సినిమా విడుదలకు కొన్ని రోజులు మాత్రమే ఉండటంతో అటు తమిళంతో పాటు తెలుగులో ప్రచార కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. ట్రైలర్‌ను సెప్టెంబర్ 29న రిలీజ్ చెయ్యబోతున్నారు. దసరా తర్వాత సినిమా ప్రేక్షకుల ముందుకు తేబోతున్నట్లు ఠాగూర్ మధు వెల్లడించారు.
మాస్ హీరో విశాల్, కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాజ్‌కిరణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: కె.ఎ.శక్తివేల్, ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్., సమర్పణ: ఠాగూర్ మధు, నిర్మాతలు: విశాల్, దవళ్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతిలాల్ గడా, దర్శకత్వం: ఎన్.లింగుస్వామి.


Click it and Unblock the Notifications











