టాలీవుడ్ లో కూడా హేమ కమిటీ.. మరీ ఆ సబ్ కమిటీ రిపోర్ట్ ఎక్కడ...
మలయాళ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ రిపోర్టులోని దారుణాలు పలు ఇండస్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇందులో పలు సంచలన విషయాలు బయటకు రావడంతో చాలామంది సినీ ప్రముఖులు ఈ నివేదికపై స్పందిస్తున్నారు. తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. సినిమాలో చాన్స్ కావాలంటే పర్సనల్‌గా తమతో గడపాలని అన్నారంటూ నటీమణులు నోరు విప్పుతున్నారు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ ఇండస్ట్రీ నటీమణులు కాస్టింగ్ కౌచ్ గురించి పలు ఇంటర్వ్యూలల్లో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో సినీ పరిశ్రమలో జరిగే గుట్టు మొత్తం రట్టవుతుంది. ఈ తరుణంలో టాలీవుడ్ లో కూడా హీరోయిన్, జూనియర్ ఆర్టిస్టులపై దారుణాలు, లైంగిక వేధింపులు జరుగుతున్నాయనీ, వాటిపై కూడా ఓ విచారణ కమిటీ వేయాలని డిమాండ్లు వెల్లువెత్తున్నాయి.
లైంగిక వేధింపులపై సబ్ కమిటీ..
ఇదిలా ఉంటే.. 2019లో తెలుగు చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం 2019 ఏప్రిల్‌లో ఓ సబ్‌కమిటీ వేసింది. ఆ కమిటీ 2019 నుండి 2022 వరకు 20కి పైగా సమావేశాలు జరిపింది. ఇందులో 24 క్రాఫ్ట్స్ కౌన్సిల్ లలో 15 కౌన్సిల్స్‌తో సమావేశమై, జూనియర్ ఆర్టిస్టులపై దాడులు, లైంగిక వేధింపుల కేసులు, వేతనాలు చెల్లించకపోవడం వంటి అంశాలపై చర్చించింది. ఆ తరువాత ఆ కమిటీ 2022 జూన్‌లో తన నివేదికను అప్పటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆధ్వర్యంలోని ప్రభుత్వానికి సమర్పించింది. కానీ ఆ ప్రభుత్వం ఆ కమిటీ నివేదికను బహిరంగపరచలేదు. అందులోని సమస్యలను పరిష్కరించలేదు. ఆ తరువాత 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ, ఆ కమిటీ నివేదికను బహిరంగ పరచాలన్న విజ్ఞప్తులు విస్మరించింది. మలయాళ చిత్ర పరిశ్రమలో హేమ కమిటీ నివేదిక సంచనాలు రేపుతుండటంతో మరోసారి ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

కేరళ సీని పరిశ్రమలో దారుణాలు హేమ కమిటీ బయటపెట్టినట్టే.. తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఇటువంటి నివేదికలు బయటకు రావాలని, ఆ సమస్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ తరుణంలో సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక, మత్స్యశాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆ నివేదిక అస్పష్టంగా ఉందనీ, చర్యలు తీసుకోవడానికి ఏమీ లేదు. సబ్-కమిటీ చాలా మందిని ఇంటర్వ్యూ చేసింది, కానీ నివేదిక అవసరమైన చర్యను అందించలేదని యాదవ్ చెప్పారు.
అలాగే.. సబ్‌కమిటీలోని సభ్యులు, ప్రముఖ మహిళా హక్కుల కార్యకర్త కొండవీటి సత్యవతి మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో లైంగిక దోపిడీ గురించి నివేదికలో ప్రస్తావించబడ్డాయనీ, ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్‌లలోని పలువురు జూనియర్ ఆర్టిస్టులు, ఇతర సహాయక సిబ్బంది నుంచి వివరాలను సేకరించామని, ప్రస్తుతం ఆ విషయాలను తాము వెల్లడించలేమనీ, అది ప్రభుత్వ పనిని ఆమె అన్నారు. ప్రస్తుత ప్రభుత్వమైనా ఈ నివేదికను విడుదల చేయాలని అన్నారు. ఇటీవల మలయాళ చిత్ర పరిశ్రమపై హేమ కమిటీ నివేదిక తర్వాత నటి సమంతా రూత్ ప్రభుతో సహా పలువురు యాక్టర్స్ సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రభుత్వం నివేదికను వెంటనే ప్రజలకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


Click it and Unblock the Notifications











