Aadikeshava: వైష్ణవ్ తేజ్ సినిమా తారుమారు.. షాక్ ఇచ్చిన 'ఆది కేశవ' మేకర్స్

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో వైష్ణవ్​ తేజ్​. శంకర్ దాదా ఎంబీబీఎస్​ మూవీలో బాలనటుడిగా పరిచమైన వైష్ణవ్​ తేజ్​.. ఉప్పెన సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. మొదటి చిత్రంతోనే ఊహించని మంచి హిట్​ అందుకున్న వైష్ణవ్​ తేజ్​ ఒక్కసారిగా దర్శక, నిర్మాతల దృష్టిని ఆకర్షించాడు. తర్వాత కొన్ని చిత్రాలు చేసిన పెద్దగా హిట్ కాలేదు. ఇప్పుడు మంచి విజయం అందుకునేందుకు ఆది కేశవగా (Aadikeshava) అవతారం ఎత్తాడు. అయితే ఈ సినిమా గురించి మేకర్స్ తాజాగా షాకింగ్ న్యూస్ చెప్పారు.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్​ తేజ్​ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం ఉప్పెన. ఈ మూవీ ఎంత బ్లాక్​ బస్టర్ హిట్​ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తర్వాత ఫిట్​నెస్​ ముద్దుగుమ్మ రకుల్​ ప్రీత్​ సింగ్​తో కలిసి వైష్ణవ్ తేజ్ నటించి సినిమా కొండపొలం. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. తర్వాత మరో ప్రేమ కథ చిత్రంగా రంగ రంగ వైభవంగా మూవీలో నటించాడు వైష్ణవ్ తేజ్. అందాల ముద్దుగుమ్మ కేతికా శర్మ హీరోయిన్​గా నటించిన ఈ సినిమా కూడా వైష్ణవ్ కు నిరాశనే మిగిల్చింది.

Panja Vaisshnav Tej Aadikeshava Movie Postponed To November

ఇప్పుడు వైష్ణవ్ తేజ్ తన కెరీర్ లో నాలుగో సినిమాగా PVT04గా వచ్చిన సినిమా 'ఆదికేశవ' (Aadikeshava). ఇందులో వైష్ణవ్ తేజ్ రుద్ర కాలేశ్వర్ రెడ్డిగా కనిపించబోతున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో డేంజర్ పిల్ల శ్రీలీల హీరోయిన్ గా అలరించేందుకు రెడీ అయింది. ఆది కేశవ్ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పించగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఎస్ నాగవంశీ, ఎస్ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఆది కేశవ సినిమాలో మలయాళ పాపులర్ నటుడు జోజు జార్జ్ విలన్ గా నటిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో బీస్ట్ మూవీ ఫేమ్ అపర్ణ దాస్ మరో కీలక పాత్ర పోషిస్తోంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఇదివరకు ఆది కేశవ సినిమాను ఆగస్ట్ 18న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ, చిత్ర నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో మూవీని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించి షాక్ ఇచ్చారు. నవంబర్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఆగస్ట్ నుంచి నవంబర్ కు ఆది కేశవ మూవీ వెళ్లేసరికి మెగా ఫ్యాన్స్ నిరాశచెందుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X