Aadikeshava: 'ఆది కేశవ'గా పంజా వైష్ణవ్ తేజ్.. స్టైలిష్ పర్ఫామెన్స్, ఆసక్తిగా గ్లింప్స్
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో వైష్ణవ్ తేజ్. శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలో బాలనటుడిగా పరిచమైన వైష్ణవ్ తేజ్.. ఉప్పెన సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. మొదటి చిత్రంతోనే ఊహించని బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్ ఒక్కసారిగా దర్శక, నిర్మాతల దృష్టిని ఆకర్షించాడు.
తర్వాత కొన్ని చిత్రాలు చేసిన పెద్దగా హిట్ కాలేదు. ఇప్పుడు మంచి విజయం అందుకునేందుకు అతని కెరీర్ లో నాలుగో సినిమాతో వస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ పరిచయం చేస్తూ గ్లింప్స్ వదిలారు. ఆ గ్లింప్స్ వివరాల్లోకి వెళితే..

మొదటి సినిమాతో: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం ఉప్పెన. ఈ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో బ్యూటిఫుల్ కృతీశెట్టి హీరోయిన్గా పరిచయమై అందరూ తనను బేబమ్మ అని పిలుచుకునేలా చేసింది. తర్వాత ఫిట్నెస్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్తో కలిసి వైష్ణవ్ తేజ్ నటించి సినిమా కొండపొలం.

ప్రేమకథా చిత్రంగా: ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన కొండపొలం సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. తర్వాత మరో ప్రేమ కథ చిత్రంగా రంగ రంగ వైభవంగా మూవీలో నటించాడు వైష్ణవ్ తేజ్. అందాల ముద్దుగుమ్మ కేతికా శర్మ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు గిరీశయ్యా దర్శకత్వం వహించారు.
శివుని గుడికి: ఎన్నో అంచనాల మధ్య విడుదలైన రంగ రంగ వైభవంగా సినిమా కూడా పెద్దగా హిట్ కొట్టలేదు. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ తన కెరీర్ లో నాలుగో సినిమాగా PVT04గా వచ్చిన సినిమా 'ఆదికేశవ' (Aadikeshava). తాజాగా ఈ టైటిల్ ను పరిచయం చేస్తూ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో వైష్ణవ్ తేజ్ రుద్ర కాలేశ్వర్ రెడ్డిగా కనిపించబోతున్నాడు. టీజర్, మూవీ టైటిల్ చూస్తుంటే శివుని గుడికి సంబంధించిన కథగా సినిమా ఉన్నట్లు తెలుస్తోంది.

స్టైలిష్ యాక్షన్: ఆ గుడి జోలికి వెళ్లకండయ్యా.. వెళితే శివుడికి కోపం వస్తుంది అని ఓ పెద్దాయన చెబుతుంటే అది విన్న రుద్ర కాలేశ్వర్ రెడ్డి రౌడీలను కొడుతూ టీజర్ చూపించారు. వైష్ణవ్ తేజ్ స్టైలిష్ యాక్షన్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. గ్లింప్స్ మొత్తం ఆకట్టుకునేలా ఉండటమే కాకుండా క్యూరియాసిటీ క్రియేట్ చేసింది.
శ్రీలీల-జోజు జార్జ్: ఆది కేశవ్ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పించగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఎస్ నాగవంశీ, ఎస్ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా, జోజు జార్జ్ విలన్ గా నటిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో బీస్ట్ మూవీ ఫేమ్ అపర్ణ దాస్ మరో కీలక పాత్ర పోషిస్తోంది.


Click it and Unblock the Notifications











