‘పేపర్ బాయ్’ రిలీజ్ డేట్ మారింది, ఈ నెలలోనే..
సంతోష్ శోభన్, ప్రియా శ్రీ, తన్య హోప్ హీరో హీరోయిన్లుగా సంపత్ నంది టీమ్‌వర్క్స్, ప్రచిత్ర క్రియేషన్స్, బి.ఎల్.ఎన్ సినిమా పతాకాలపై సంపత్ నంది, వెంకట్, నరసింహ నిర్మించిన చిత్రం 'పేపర్ బాయ్'. హ్యాపీ ఎండింగ్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, గాడ్ మస్ట్ బి క్రేజీ లాంటి షార్ట్ ఫిల్మ్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ ఫిల్మ్ మేకర్ వి జయశంకర్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఇటీవల విడుదలైన 'పేపర్ బాయ్' ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. మొదట ఈచిత్రాన్ని సెప్టెంబర్ 7న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇపుడు రిలీజ్ డేట్ మారింది. ఆగస్టు 31న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

'పేపర్ బాయ్' సినిమాను ఒక సింపుల్ లవ్ స్టోరీతో రూపొందించారు. గద్వాల్ రెడ్డిగారు అని ఉస్మానియా యూనివర్శిటీలో పని చేసే ఒక ప్రొఫెసర్ అమ్మాయికి, పేపర్ వేసుకునే కుర్రాడికి మధ్య జరిగే ప్రేమకథ. కథ సాధారణంగా ఉన్నా.... సిచ్యువేషన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అప్రోచ్ చాలా హానెస్ట్ గా ఉంటుంది అంటున్నారు సంపత్ నంది.
ఈ చిత్రంలో సంతోష్ శోభన్, ప్రియా శ్రీ, తన్య హోప్, పోసాని కృష్ణమురళి, బిత్తిరి సత్తి, విద్యుల్లేఖ రామన్, జయప్రకాష్ రెడ్డి, అన్నపూర్ణమ్మ, అభిషేక్ మహర్షి, మహేష్ విట్టా తదితరులు నటిస్తున్నారు.
కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ : సంపత్ నంది, డైరెక్షన్: వి. జయశంకర్, నిర్మాతలు: సంపత్ నంది,రాములు, వెంకట్, నరసింహ, సంగీతం: భీమ్స్, ఎడిటర్: తమ్మిరాజు, సినిమాటోగ్రఫి: సుందర్ రాజన్, ఆర్ట్: రాజీవ్, స్క్రిప్ట్ కో ఆడినేటర్: సుధాకర్ పావులూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళి మామిళ్ల.


Click it and Unblock the Notifications











