ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ బ్యాక్‌డ్రాప్‌గా విటమిన్ షి.. పేపర్ బాయ్ దర్శకుడి వినూత్న ప్రయోగం

ప్రముఖ దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా మారి రూపొందించిన పేపర్ బాయ్‌ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన డైరెక్టర్ జయశంకర్ మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం తన రెండో చిత్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ నేపథ్యంగా విటమిన్ షి అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్‌తో యూట్యూబ్‌లో ప్రేక్షకాదరణ పొందిన శ్రీకాంత్ గుఱ్ఱం హీరోగా, గుజరాతీ భాషలో హీరోయిన్‌గా రాణిస్తున్న ప్రాచీ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై రవి పోలిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ చిత్రంలో రంజిత్ రెడ్డి, వికాస్, మొయిన్, సంజీవ్ జోషి, అశోక్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. శివప్రసాద్ సినిమాటోగ్రఫి, పీవీఆర్ రాజు సంగీతం, ఎల్ఎన్ స్టూడియోస్ ఎడిటింగ్, నిర్మాతగా రవి పోలిశెట్టి, రచన-దర్శకత్వ బాధ్యతతను జయశంకర్ నిర్వహిస్తున్నారు.

Paper Boy directors Vitamin She getting ready for release

విటమిన్ షి చిత్రం గురించి దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ ప్రస్తుత సాంకేతిక యుగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ అనే అంశం మనుషుల జీవితాల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది. అది జీవితాన్ని ఎలా ఆక్రమిస్తుందనేది ఈ సినిమా మూల కథాంశం. మనకు ఎంతో అండగా ఉంటుందనుకొన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ చివరకు మన జీవితాలకు సవాల్ విసిరే పరిస్థితికి వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయనేది సెటైరికల్‌గా ఈ సినిమాలో చూపించాం అని జయశంకర్ తెలిపారు.

Paper Boy directors Vitamin She getting ready for release

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఎంత టాప్ లెవెల్ కి వెళ్లినా... చివరకు మనుషుల్నేరీప్లేస్ చేసే స్థాయికి వచ్చినా కూడా, మనుషుల ఎమోషన్స్ ని రీప్లేస్ చేయడం మాత్రం వాటికి అసంభవం. ఇలాంటి అంశాలన్నింటిని వినోదభరితంగా చూపించాం. ఈ సినిమాలో మొత్తం 12 పాత్రలు ఉంటాయి కానీ, ప్రధానంగా 4 పాత్రల చుట్టే సినిమా కథ తిరుగుతుంది. లాక్‌డౌన్ సమయంలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చేశాం. కథపరంగానే కాకుండా, సాంకేతికంగా కూడా ఉన్నత ప్రమాణాలతో ఈ సినిమా ఉంటుంది అని జయశంకర్ చెప్పారు.

Paper Boy directors Vitamin She getting ready for release

విటమిన్ షి చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఇటీవల ప్రముఖ దర్శకుడు క్రిష్ చేతుల మీదుగా ఆవిష్కరించాం. ఈ ఫస్ట్‌లుక్‌కు ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఫస్ట్ కాపీతో సహా సినిమా మొత్తం విడుదలకు రెడీగా ఉంది. సానుకూల పరిస్థితులను చూసుకొని అతి త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం అని జయశంకర్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X