‘పేపర్ బాయ్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

By Bojja Kumar

సంతోష్ శోభన్, ప్రియా శ్రీ, తన్య హోప్ హీరో హీరోయిన్లుగా సంపత్ నంది టీమ్‌వర్క్స్‌, ప్రచిత్ర క్రియేషన్స్, బి.ఎల్.ఎన్ సినిమా పతాకాలపై సంపత్ నంది, వెంకట్, నరసింహ నిర్మించిన చిత్రం 'పేపర్ బాయ్'. హ్యాపీ ఎండింగ్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, గాడ్ మస్ట్ బి క్రేజీ లాంటి షార్ట్ ఫిల్మ్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ ఫిల్మ్ మేకర్ వి జయశంకర్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఇటీవల విడుదలైన 'పేపర్ బాయ్' ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ రిలీజ్ డేట్ ఖరారైంది. సెప్టెంబర్ 7న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

'వర్షం' లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించిన ఫేమస్ దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇంతకు ముందు శోభన్ గోల్కొండ హైస్కూల్ మూవీలో నటించాడు.

Paper Boy release date September 7

ఇటీవల టీజర్ రిలీజ్ వేడుకలో సంపత్ నంది మాట్లాడుతూ... 'పేపర్ బాయ్' ఒక సింపుల్ లవ్ స్టోరీ. గద్వాల్ రెడ్డిగారు అని ఉస్మానియా యూనివర్శిటీలో పని చేసే ఒక ప్రొఫెసర్ అమ్మాయికి, పేపర్ వేసుకునే కుర్రాడికి మధ్య జరిగే ప్రేమకథ. మన ఇంట్లో పేపర్ వేసే అబ్బాయి మన ఇంటి అమ్మాయిని ప్రేమిస్తే తర్వాత ఏ జరుగుతుంది అనే చాలా సింపుల్ కథ. కానీ ఇందులో సిచ్యువేషన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అప్రోచ్ చాలా హానెస్ట్ గా ఉంటుంది. చాలా నిజాయితీగా సినిమా తీశాం. అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను అన్నారు.

నటీనటులు:
సంతోష్ శోభన్, ప్రియా శ్రీ, తన్య హోప్, పోసాని కృష్ణమురళి, బిత్తిరి సత్తి, విద్యుల్లేఖ రామన్, జయప్రకాష్ రెడ్డి, అన్నపూర్ణమ్మ, అభిషేక్ మహర్షి, మహేష్ విట్టా.
సాంకేతిక నిపుణులు:
కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ : సంపత్ నంది.
డైరెక్షన్: వి. జయశంకర్
నిర్మాతలు: సంపత్ నంది,రాములు, వెంకట్, నరసింహ.
సంగీతం: భీమ్స్
ఎడిటర్: తమ్మిరాజు
సినిమాటోగ్రఫి: సుందర్ రాజన్.
ఆర్ట్: రాజీవ్
స్క్రిప్ట్ కో ఆడినేటర్: సుధాకర్ పావులూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళి మామిళ్ల

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X