ముద్దు పెట్టుకోవడం అంటే పెదాలు మార్చుకోవడం కాదు.. ఊపిరి మార్చుకోవడం!
ప్రముఖ దర్శకుడు సంపత్ నంది నిర్మాత మారి తెరకెక్కిస్తున్న చిత్రం పేపర్ బాయ్. యంగ్ హీరో సంతోష శోభన్, రియా సుమన్ ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. తన్య హోప్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. బి టెక్ చదివి పేపర్లు వేసే యువకుడి ఎమోషనల్ ప్రేమ కథగా ఈ చిత్రం రాబోతోంది. జయ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలయింది.
ఈ చిత్రం ఎక్కువగా రొమాంటిక్, ఎమోషనల్ అంశాలతో రూపొందినట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. హీరో, హీరోయిన్ మధ్య సన్నివేశాల్ని యూత్ కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముద్దు పెట్టుకోవడం అంటే పెదాలు మార్చుకోవడం కాదు.. ఊపిరిమార్చుకోవడం లాంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

సెప్టెంబర్ 7 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏ చిత్రానికి బీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. సంపత్ నంది నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











