twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐదు జీవితాల భావోద్వేగమైన కథ.. సరికొత్త సస్పెన్స్, థ్రిల్లర్‌గా దారి.. క్రేజీగా కాన్సెప్ట్ పోస్టర్

    |

    కంటెంట్ బేస్డ్ సినిమాలకు దక్కుతున్న ఆదరణ ఎంతోమంది నూతన దర్శకనిర్మాతలకు బలాన్నిస్తోంది. కొత్త కొత్త కథలను రాసుకొని వాటిని ప్రేక్షకుల మెప్పు పొందేలా రూపొందిస్తున్నారు. ఇదే బాటలో రాబోతున్న విలక్షణ కథాంశం 'దారి'. ముందెన్నడూ చూడని స్టోరీ లైన్ ఎంచుకొని అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా కథ రాసుకొని దాన్ని 'దారి' అనే పేరుతో డైరెక్టర్ యు. సుహాష్ బాబు తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు.

    టాలీవుడ్‌‌లో ఫీల్‌గుడ్ కంటెంట్‌తో రూపొందుతున్న చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్నది. చిన్న చిత్రాలైనా కంటెంట్ రిచ్‌గా ఉంటే ప్రేక్షకులు సినిమాలను భారీ హిట్‌గా మారుస్తున్నారు. అయితే విభిన్నమైన కథ, కథనాలతో వస్తున్న చిత్రం దారి. అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని డైరెక్టర్ యూ సుహాష్ బాబు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రమోషన్‌లో భాగంగా దారి కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దారి సినిమా గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

    Parameshwar hivrales Daari movies concept poster released

    ఫిఫ్త్ హౌస్ ప్రొడక్షన్ బ్యానర్‌పై యు సుహాష్ బాబు దర్శకత్వంలో దారి సినిమా రూపొందుతోంది. నరేష్ మామిళ్ళ, మోహన్ ముత్తిరయిల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పరమేశ్వర్ హివ్రాలే, కళ్యాణ్ విట్టపు, సునీత సద్గురు, సాయి తేజ గోనుగుంట్ల, అభిరామ్ (క్రేజీ అభి) ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ కాపీ తో సెన్సార్‌కి సిద్దంగా ఉంది.

    దారి సినిమా విషయానికి వస్తే.. భూ ప్రపంచంలో ప్రతీ జీవికి ఏదో ఒక సమస్య ఉండటం సహజం, ఆ సమస్య నుంచి బయట పడటానికి మన ముందు ఉండేవి మూడే దారులు. అవి పారిపోవడం, దాక్కోవడం, లేదా ఎదురుతిరగడం. దారి ఏదైనా గమ్యం మాత్రం ఒక్కటే. ఈ కథలో కూడా అయిదుగురు వేరువేరు జీవితాలకు ఎదురైన ఒకే సమస్యను ఇతివృత్తంగా తీసుకొని ప్రతి సన్నివేశంలో ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా రూపొందిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, ఇతర అప్‌డేట్స్‌ను దర్శక, నిర్మాతలు ఇవ్వనున్నారు.

    నటీనటులు: పరమేశ్వర్ హివ్రాలే, కళ్యాణ్ విట్టపు, సునీత సద్గురు, సాయి తేజ గోనుగుంట్ల, అభిరామ్ (క్రేజీ అభి)
    కథ, దర్శకత్వం: యు. సుహాష్ బాబు
    బ్యానర్: ఫిఫ్త్ హౌస్ ప్రొడక్షన్
    నిర్మాతలు: నరేష్ మామిళ్ళ, మోహన్ ముత్తిరయిల్
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దమ్ము రాజా కిషన్
    పీఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

    English summary
    Young and Aspiring actor Parameshwar hivrale is coming with Daari movie. This movie's concept poster released and getting good response.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X