‘సర్కారు వారి పాట’లో ఆ సినిమా ఛాయలు: మరోసారి అలరించనున్న మహేశ్

సూపర్ స్టార్ మహేశ్ బాబు - పరశురాం కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమా ప్రకటన ఎప్పుడో వచ్చినప్పటికీ షూటింగ్ మాత్రం దుబాయ్‌లో ఇటీవలే ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఏకధాటిగా చిత్రీకరణ జరుపుతోంది మూవీ యూనిట్. ఎడారి దేశంలో జరుగుతోన్న షూటింగ్‌లో హీరో ఇంట్రడక్షన్ సీన్‌లో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే, కొన్ని పాటలను కూడా షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. 'సర్కారు వారి పాట' విషయంలో దర్శకుడు పరశురాం మహేశ్ బాబు నటించిన సూపర్ హిట్ మూవీ 'దూకుడు' థీమ్‌ను ఫాలో అవుతున్నాడు. శ్రీను వైట్ల స్టైల్‌లోనే ఇందులోనూ కామెడీ ట్రాక్‌ను చూపించబోతున్నాడట. మరీ ముఖ్యంగా సూపర్ స్టార్‌తో అదిరిపోయే కామెడీని పండించబోతున్నాడని అంటున్నారు. అంటే ఈ సినిమాలో పాత మహేశ్‌ను మరోసారి తెర మీద చూపించబోతున్నాడన్న మాట. అంతేకాదు, 'దూకుడు'లో హీరోయిన్ సమంతతో హీరో నడిపే లవ్ ట్రాకు మాదిరిగానే 'సర్కారు వారి పాట'లోనూ డిజైన్ చేశాడని తెలుస్తోంది.

Parasuram Follows Dookudu Theme for Sarkaru Vaari Paata

'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి సూపర్ డూపర్ హిట్ల తర్వాత మహేశ్ బాబు చేస్తోన్న 'సర్కారు వారి పాట'పై భారీ అంచనాలే ఉన్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ దీనికి సంగీతం సమకూర్చుతున్నాడు. ఇక, ఈ సినిమాను వచ్చే జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X