Karan Arjun డైరెక్టర్ పరుశురాం చేతుల మీదుగా ఫస్ట్ లక్.. పాకిస్థాన్ సరిహద్దులో షూట్ అంటూ
కంటెంట్ నచ్చితే చాలు కొత్తవారా, పాతవారా అని చూడకుండా ఇటీవల కాలంలో చిన్న సినిమాలను కూడా ఆడియన్స్ భారీ సక్సెస్ చేస్తున్నారు. అలాంటి నేపథ్యంలో కంటెంట్‌ను మాత్రమే నమ్ముకుని వస్తున్న రోడ్ థ్రిల్లర్ కరణ్ అర్జున్.రెడ్‌రోడ్ థ్రిల్లర్స్ పతాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. డాక్టర్ సోమేశ్వరరావు పొన్నాన, బాలక్రిష్ణ ఆకుల, సురేష్, రామకృష్ణ, క్రాంతి కిరణ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రవి మేకల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ లాంచ్ ప్రముఖ దర్శకుడు పరశురామ్ చేతుల మీదుగా జరిగింది.
ఈ సందర్భంగా దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ...కరణ్ అర్జున్ టైటిల్‌తోపాటు ఫస్ట్ లుక్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. దర్శకుడు స్టోరి లైన్ కూడా చెప్పారు. ప్రజంట్ ట్రెండ్‌కు కనెక్టయ్యే స్టోరి. టీమ్ అంతా కూడా సక్సెస్ సాధించాలనే పట్టుదలతో సినిమా తీసినట్లు కనిపించింది. ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు అన్నారు.

చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ....మా సినిమా ఫస్ట్ లుక్ దర్శకుడు పరశురామ్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇంత వరకు ఎవరూ చేయని లొకేషన్స్‌లో భారత్, పాకిస్థాన్ సరిహద్దులో ఎంతో రిస్క్ తీసుకుని మా సినిమా షూటింగ్ చేశాం. మూడు పాత్రలతో ఊహించని మలుపులతో ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా సాగే రోడ్ థ్రిల్లర్ చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఎమోషన్స్ ఉన్నాయి. ఈ సినిమా ఇంత క్వాలిటీగా రావడానికి మా నిర్మాతలే కారణం. వారు ఎక్కడా రాజీ పడకుండా నాకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో అనుకున్నట్లు గా తీయగలిగాను అని అన్నారు.
నటీనటులు: అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా, మాస్టర్ సునీత్, అనిత చౌదరి, రఘు జి, జగన్, ప్రవీణ్ పురోహిత్, మోహిత్, వినోద్ బాటి, ప్రసన్న తదితరులు
ఫైట్స్ : రామ్ సుంకర
ఎడిటర్ : కిషోర్ బాబు
కాస్ట్యూమ్ డిజైనర్: లతా మోహన్
మ్యూజిక్: రోషన్ సాలూరి
పాటలు: సురేష్ గంగుల
కొరియోగ్రఫి: రవి మేకల
డీవోపి: మురళి కృష్ణ వర్మన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవి మేకల
ప్రొడ్యూసర్స్: డాక్టర్ సోమేశ్వరరావు పొన్నాన, బాలకృష్ణ ఆకుల, సురేష్, రామకృష్ణ ,క్రాంతి కిరణ్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మోహన్ శ్రీవత్స


Click it and Unblock the Notifications











