మాల్దీవుల్లో యంగ్ హీరోయిన్ ఎంజాయ్.. అది నా రెండో ఇల్లు అంటున్న హాట్ భామ
హీరో హీరోయిన్లకు ఏ మాత్రం సమయం దొరికినా అలా అలా షికారుకెళ్ళడం, జాలీగా ఎంజాయ్ చేసేయడం పరిపాటిగా అయిపోయింది. సుదూర ప్రదేశాలకు వెళ్లి అక్కడ సరదాగా గడిపేందుకు ఇష్టపడుతున్నారు నేటి హీరోహీరోయిన్స్. ఈ నేపథ్యంలోనే మాల్దీవుల్లోని మహాసముద్రంలో అలా అలా షికారు చేస్తూ యంగ్ హీరోయిన్ పరిణీతి చోప్రా.
ఈ పర్యటనలో భాగంగా నల్లరంగు స్విమ్ సూట్ ధరించి, నల్ల కళ్లద్దాలు పెట్టి సముద్రంలో ఎంజాయ్ చేస్తూ జలకాలాడింది ఈ సుందరి. తాళ్లతో కట్టిన ఊయలలో ఊగుతూ కెమెరాకు ఫోజులిచ్చింది. తన వెకేషన్ సమయాన్ని ఎక్కువగా మాల్దీవుల్లో గడుపుతుంటానని, మహాసముద్రంలో ఎంజాయ్ చేస్తున్న ఓ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.

ఈ మేరకు ''నాకు కొంత సముద్రం ఇవ్వండి...నేను సంతోషంగా ఉన్నాను...మాల్దీవులు దాదాపు నా రెండవ ఇల్లు లాంటిది...డైవింగ్‌తోనే పరిపూర్ణత వస్తోంది'' అని ట్యాగ్ చేసింది పరిణితి. విహార యాత్రలంటే ఎక్కువగా ఇష్టపడే ఈ ముద్దుగుమ్మ.. డిసెంబరు నెలలో ఆస్ట్రియా లోయలతోపాటు అక్కడి మంచుకొండల్లోనూ విహరించింది. చలిమంట కాచుకుంటూ ఆ లోయల అందాలను ఆస్వాదిస్తూ తన ఫోటోలను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది.

ఇక పరిణీతి సినిమాల విషయానికొస్తే.. ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ 'సైనా నెహ్వాల్' జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ చిత్రంలో ఆమె లీడ్ రోల్ పోషిస్తోంది. అలాగే 'ది గర్ల్ ఆన్ ది ట్రైన్' చిత్రం హిందీ రీమేక్ లోనూ ఆమె నటిస్తోంది. సరైన అవకాశం వస్తే సత్తా చాటేందుకు ఎప్పుడూ సిద్దమే అంటోంది పరిణితి.


Click it and Unblock the Notifications











