twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గాయం నుంచి కోలుకున్న పరిణితి.. తిరిగి 'సైనా' సెట్స్ పైకి.. లేటెస్ట్ అప్‌డేట్

    |

    భారత బ్యాట్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అమోల్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'సైనా' అనే పేరు ఖరారు చేశారు. టీ సిరీస్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాలో సైనా పాత్రలో పరిణితి చోప్రా నటిస్తోంది. తొలుత ఈ పాత్ర కోసం శ్రద్ధా కపూర్‌ను తీసుకోగా.. బ్యాడ్మింటన్‌లో శిక్షణ కూడా తీసుకున్న అనంతరం ఆమె తప్పుకుంది. దీంతో ఆమె ప్లేస్‌లో పరిణితి చేరింది.

    సైనా నెహ్వాల్ పాత్రలో నటించడానికై గతంలో నాలుగు నెలలపాటు బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేసింది పరిణితి చోప్రా. ఈ ప్రాక్టీస్‌లో ఆమె గాయపడింది. మెడకు గాయం కావడంతో కొన్నాళ్లు షూటింగుకు దూరంగా ఉంది పరిణితి. అయితే తాజా సమాచారం మేరకు ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ఈమె.. తిరిగి 'సైనా' షూటింగులో పాల్గొంటోందని తెలిసింది.

     Parineeti Chopra Joined the sets of Saina Nehwal Biopic

    గతంలో హైదరాబాద్ లోని సైనా నెహ్వాల్ ఇంటికి వచ్చి మరీ బ్యాడ్మింటన్ ఆట గురించి తెలుసుకుంది పరిణితి. ఈ సందర్భంగా ఆమె ధరించిన షూ, డ్రెస్సులు, ఆమె ఆట గురించి అడిగి తెలుసుకొని సన్నద్ధం అయింది. పరిణితి చోప్రా లూజ్ టీషర్టు, షార్ట్ ధరించి షూటింగులో పాల్గొన్న చిత్రాలను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన పరిణితి నెటిజన్ల నుంచి విశేష స్పందన పొందుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సైనా మూవీ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    Parineeti Chopra shared an update about her forthcoming project with her fans on social media. In her post, the 30-year-old actress revealed that she hasn't started shooting for Saina Nehwal's biopic.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X