twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రద్దా కపూర్ భారాన్ని నెత్తినేసుకున్న పరిణతి.. చివరకు ఇలా!

    |

    పాపం పరిణితి కష్టాలు అన్నీఇన్నీ కావు. బాలీవుడ్ భామ శ్రద్ద కపూర్ పడాల్సిన పాట్లన్నీ పరిణితి పడాల్సి వస్తోంది. ఏదో.. మంచి అవకాశం వచ్చింది కదా టాలెంట్ చూపెడుదాం అన్న పరిణితికి అలసట వచ్చేసింది. తాజాగా తన ట్విట్టర్ వేదికగా ఓ పిక్ షేర్ చేసి ఈ విషయం చెప్పకనే చెప్పేసింది పరిణితి. బ్యాట్మింటన్ అంటే మామూల మరి!

    భారత బ్యాట్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'సైనా' అనే పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాకు అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాలో సైనా పాత్రలో పరిణితి చోప్రా నటిస్తోంది. తొలుత ఈ పాత్ర కోసం శ్రద్ధా కపూర్‌కు తీసుకోగా.. ఈ పాత్ర చేయడం కోసం శ్రద్దా కపూర్, సైనా నెహ్వాల్ వద్ద బ్యాడ్మింటన్‌లో శిక్షణ కూడా తీసుకుంది. అయితే ఆ తరువాత కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ ప్రాజెక్టు నుండి ఆమె తప్పుకోవడం జరిగింది.

    Parineeti Chopra Shares A Saina Nehwal Biopic Update Still

    దీంతో సైనా పాత్రలో యాక్ట్ చేసే ఛాన్స్ పరిణితి చోప్రాని వరించింది. ముందుగా ఈ ఛాన్స్ వచ్చినందుకు తెగ హ్యాపీగా ఫీల్ అయిన పరిణితి చోప్రా.. ప్రస్తుతం తెగ కష్టపడాల్సి వస్తోంది. వెండితెరపై ఓ రియల్ క్రీడాకారిణిగా కనిపించాలంటే ఈ మాత్రం కష్టం తప్పదు మరి. ఈ మేరకు పరిణితి కూడా సైనా నెహ్వాల్ వద్ద శిక్షణ తీసుకుంటోందట. అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం సైనా వద్ద బ్యాడ్మింటన్ నేర్చుకుంటోంది పరిణితి.

    తాజాగా బ్యాడ్మింటన్ ఆడుతూ అలసిపోయి పడుకుని ఉన్న ఓ ఫొటోను పరిణితి తన ట్విట్టర్‌లో షేర్ చేసింది. దీనికి ప్రాక్టీస్‌కు ముందు.. తర్వాత' అంటూ కాప్షన్ కూడా తగిలించి. పైగా సైనా నువ్వు ఈ ఆట ఎలా ఆడుతున్నావు అని కామెంట్ చేసింది పరిణితి. అంటే పాత్ర కోసం అమ్మడి పాట్లు చెప్పరానివని అర్థమవుతోంది కదూ!

    English summary
    Parineeti Chopra shared an update about her forthcoming project with her fans on social media. In her post, the 30-year-old actress revealed that she hasn't started shooting for Saina Nehwal's biopic
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X